NEET PG Exam 2024: నీట్‌ పీజీ పరీక్ష తేదీలో మార్పు.. కొత్త డేట్‌ ఇదే..!

నీట్‌ పీజీ పరీక్ష తేదీలో మార్పు చోటుచేసుకుంది. ఈ పరీక్షను జులై 7న నిర్వహించనున్నట్లు ఎన్‌బీఈఎంఎస్‌ ప్రకటించింది.

Published : 09 Jan 2024 18:14 IST

దిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET PG 2024) తేదీలో మార్పు చోటుచేసుకుంది. ఈ పరీక్షను జులై 7న నిర్వహించనున్నట్లు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NBEMS) మంగళవారం ప్రకటించింది. తొలుత ఈ పరీక్షను మార్చి 3న నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. నీట్‌ పీజీ పరీక్ష రాసే అభ్యర్థుల అర్హతకు సంబంధించిన కటాఫ్‌ తేదీని ఆగస్టు 15, 2024గా నిర్ణయించింది. దీని ప్రకారం ఆగస్టు 15 లేదా అంతకన్నా ముందు ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసిన ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఈ పరీక్షను రాసే వీలుంటుంది.  అయితే, ఈ పరీక్ష తేదీలో సైతం మార్పు జరిగే అవకాశం ఉంది. కచ్చితమైన తేదీలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చని NBEMS సూచించింది.  

రామంతాపూర్‌ హెచ్‌పీఎస్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. అర్హతలివే..!

మరోవైపు, ప్రతిపాదిత నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (NExT)ను ఈ ఏడాది నిర్వహించడం లేదు. దీంతో  2018 పీజీ వైద్య విద్య నిబంధనలను సవరించి ఇటీవల నోటిఫై చేసిన పీజీ వైద్య విద్య నిబంధనలు-2023 ప్రకారం.. నీట్‌ పీజీ పరీక్ష జరగనుంది. పీజీ ప్రవేశాలకు నెక్స్ట్‌ అమల్లోకి వచ్చే వరకూ కొత్త నిబంధనల ప్రకారమే నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని