Bank Jobs: పీఎన్‌బీలో 240 ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తులకు రేపే లాస్ట్‌!

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(PNB)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు ముగుస్తోంది. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 11వరకు ఆన్‌లైన్‌లో దఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..

Published : 10 Jun 2023 14:40 IST

దిల్లీ: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(PNB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ బ్యాంకులోని వివిధ విభాగాల్లో 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులకు గడువు ఆదివారం వరకే గడువు ఉంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక కోసం జులై 2న ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఉద్యోగ స్థాయిని బట్టి నెలకు కనిష్ఠంగా రూ.36వేల నుంచి గరిష్ఠంగా రూ.78వేల వరకు వేతనం చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

పోస్టుల వివరాలివే..

  • మొత్తం ఖాళీలు 240 కాగా.. వీటిలో ఆఫీసర్‌-క్రెడిట్: 200; ఆఫీసర్‌-ఇండస్ట్రీ: 08; ఆఫీసర్‌-సివిల్ ఇంజినీర్: 05; ఆఫీసర్‌-ఎలక్ట్రికల్ ఇంజినీర్: 04; ఆఫీసర్‌-ఆర్కిటెక్ట్: 01; ఆఫీసర్-ఎకనామిక్స్: 06; మేనేజర్-ఎకనామిక్స్: 04; మేనేజర్-డేటా సైంటిస్ట్: 03; సీనియర్ మేనేజర్-డేటా సైంటిస్ట్: 02; మేనేజర్-సైబర్ సెక్యూరిటీ: 04;  సీనియర్ మేనేజర్- సైబర్ సెక్యూరిటీ: 03 చొప్పున ఉన్నాయి.
  • విద్యార్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ బీఆర్క్‌/ సీఏ/ సీఎంఏ/ ఐడీడబ్ల్యూఏ/ ఎంఈ/ ఎంటెక్‌/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ/ పీజీడీఎంలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు కనీసం 21 నుంచి 38 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయో పరిమితిలో సడిలింపు ఉంది.
  • దరఖాస్తు రుసుం ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ₹50+ జీఎస్టీ కాగా.. ఇతరులకు ₹1000+ జీఎస్టీ
  • ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌(అవసరమైతే), పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే..: విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని