Reliance jobs: రిలయన్స్‌లో ఉద్యోగాలు.. బీటెక్‌ విద్యార్థులకు సదవకాశం

Reliance jobs: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఫ్రెషర్లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.

Updated : 12 Jan 2024 15:26 IST

Reliance jobs | దిల్లీ: ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance jobs) ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తమ కంపెనీలోని వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకునేందుకు గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ ట్రైనీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పెట్రో కెమికల్ నుంచి న్యూ ఎనర్జీ వరకు రిలయన్స్‌కు చెందిన వివిధ వ్యాపార విభాగాల్లో ఉద్యోగావకాశాలను కల్పించనుంది.

క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించే కంపెనీలు కొన్ని విద్యా సంస్థలకే పరిమితమవుతున్నాయని, దీనివల్ల టాప్‌ 50 లేదా టాప్‌- 100 సంస్థల విద్యార్థులకే అవకాశాలు లభిస్తున్నాయని  రిలయన్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను చేపట్టినట్లు తెలిపింది. గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ (GET) 2024 పేరిట ప్రారంభించిన ఈ డ్రైవ్‌లో భాగంగా జనవరి 11 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

బైజూస్‌ విలువ 1 బిలియన్‌ డాలర్లే.. బ్లాక్‌రాక్‌ అంచనా!

బీటెక్‌, బీఈ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐసీటీఈ ఆమోదం పొందిన విద్యా సంస్థల నుంచి కెమికల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఇన్‌స్ర్టుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్‌ చేసిన విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారిని ఫిబ్రవరి 23 నుంచి మార్చి 11 వరకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేస్తారు. మార్చి నెలాఖరుకు ఈ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.

రిలయన్స్‌ అందిస్తున్న ఈ సదావకాశాన్ని ఇంజినీరింగ్‌ విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను (https://relianceget2024.in/) సైతం రిలయన్స్ అందుబాటులో ఉంచింది. అందులో అర్హత, నియామక ప్రక్రియ, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ వివరాలను అందులో పొందుపరిచింది. అభ్యర్థులు 10, 12, డిప్లొమాలో 60 శాతం మార్కులు లేదా 6 CGPA  సాధించి ఉండాలి. ఇంజినీరింగ్‌లో 60 శాతం (ఏడో సెమిస్టర్‌/ గ్రాడ్యుయేషన్‌) మార్కులు సాధించిన వారు అర్హులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని