SSC GD Constable: సీఏపీఎఫ్‌లో కానిస్టేబుల్ (జీడీ) పరీక్షల షెడ్యూల్‌ విడుదల

దిల్లీ పోలీస్‌, సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది.

Published : 26 Oct 2023 20:16 IST

దిల్లీ: కేంద్ర సాయుధ బలగాల్లో ఇటీవల 50వేలకు పైగా ఖాళీల్ని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ భర్తీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ రాత పరీక్షల షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్-ఎగ్జిక్యూటివ్‌ (పురుషులు, మహిళలు) పోస్టులకు నవంబర్‌ 14, 15, 16, 17, 20, 21, 22, 23, 24, 28, 29, 30, డిసెంబర్‌ 1, 2, 3వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్‌సీ తెలిపింది.

ప్రపంచ ర్యాంకుల్లో IIIT-హైదరాబాద్‌కు చోటు.. భారత్‌ నుంచి టాప్‌ యూనివర్సిటీలివే..!

అలాగే, సీఏపీఎఫ్‌లో కానిస్టేబుల్‌ (జీడీ), ఎస్‌ఎస్‌ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్‌ (జీడీ), నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB)లో సిపాయి పోస్టులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29; మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. SSC వార్షిక క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం.. నవంబర్‌ 24న ఈ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. డిసెంబర్‌ 28తో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి.. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే, ఈసారి ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని