JEE Advanced 2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా

JEE Advanced 2023 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. తెలుగు విద్యార్థులు సత్తా చాటడం విశేషం

Updated : 29 Oct 2023 13:57 IST

దిల్లీ: నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 ఫలితాల్లో (JEE Advanced 2023 Results) తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన వావిలాల చిద్విలాస్‌ రెడ్డి జాతీయ స్థాయిలో తొలిస్థానంలో నిలవడం విశేషం. మరోవైపు అమ్మాయిల కేటగిరీలో నాయకంటి నాగ భవ్యశ్రీ టాపర్‌గా నిలిచింది. తొలి పది ర్యాంకుల్లో ఆరుగురు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది పరీక్షకు హాజరయ్యారు.

తొలి 10 మంది ర్యాంకర్లు వీళ్లే..

1. వావిలాల చిద్విలాస్‌ రెడ్డి

2. రమేశ్‌ సూర్య తేజ

3. రిషి కర్లా

4. రాఘవ్‌ గోయల్‌

5. అడ్డగడ వెంకట శివరామ్‌

6. ప్రభవ్‌ ఖండేల్వాల్‌

7. బిక్కిన అభినవ్ చౌదరి

8. మలయ్‌ కేడియా

9. నాగిరెడ్డి బాలాజీ రెడ్డి

10. యక్కంటి ఫణి వెంకట మనీందర్‌ రెడ్డి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని