యోగా థెరపీలో ఏడాది కోర్సు

ఆందోళన, ఒత్తిడులను నియంత్రించి.. ఆరోగ్యాన్ని పెంచే యోగాకు కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఎస్‌-వ్యాస-కోడ్‌, సెంటర్‌ ఫర్‌ ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ‘డిప్లొమా ఇన్‌ యోగా థెరపీ’ కోర్సును ప్రవేశపెట్టింది.

Updated : 15 Jun 2023 04:22 IST

 

ఆందోళన, ఒత్తిడులను నియంత్రించి.. ఆరోగ్యాన్ని పెంచే యోగాకు కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఎస్‌-వ్యాస-కోడ్‌, సెంటర్‌ ఫర్‌ ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ‘డిప్లొమా ఇన్‌ యోగా థెరపీ’ కోర్సును ప్రవేశపెట్టింది. ఇంటర్మీడియట్‌/ ప్లస్‌ టు అర్హత ఉన్నవాళ్లు ఈ కోర్సులో చేరొచ్చు.
కోర్సు వివరాలు: కోర్సు వ్యవధి ఏడాది (2 సెమిస్టర్లు). సెమిస్టర్‌-1, సెమిస్టర్‌-2లలో ఒకవారం పాటు పీసీపీ (పర్సనల్‌ కాంటాక్ట్‌ ప్రోగ్రామ్‌) ఉంటుంది.
ఇంటర్న్‌షిప్‌: బెంగళూరులోని ఆరోగ్యధామలో 28 రోజులపాటు ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తారు.
ఎక్స్‌టర్న్‌షిప్‌: సెమిస్టర్‌-1, 2 పూర్తయిన తర్వాత ఎక్స్‌టర్న్‌షిప్‌ 30 రోజులు ఉంటుంది.  
ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తారు. క్రెడిట్స్‌ మొత్తం 42. కోర్సు ఫీజు రూ.35,000.  
ఉద్యోగావకాశాలు: ‘డిప్లొమా ఇన్‌ యోగా థెరపీ’ కోర్సు పూర్తిచేసినవారు ‘ఆయుష్మాన్‌ భారత్‌ అభియాన్‌’ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 12,500 హెల్త్‌, వెల్‌నెస్‌ సెంటర్లలో యోగా థెరపీ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు పొందొచ్చు. ఇక్కడ మాత్రమే కాకుండా.. హాస్పిటళ్లు, హెల్త్‌కేర్‌, వెల్‌నెస్‌ సెంటర్లు, స్పాలు, యోగా సెంటర్లు, నేచురోపతీ హాస్పిటళ్లు, హెల్త్‌క్లబ్స్‌లో కూడా పనిచేయొచ్చు.


సంప్రదించాల్సిన నంబర్లు: 080-2263 9901/ 02/ 98704 89477
ఈమెయిల్‌: dyt@svyasa.edu.in 
దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2023
వెబ్‌సైట్‌: www.svyasadde.com


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని