TSPSC: గ్రూప్‌- 4 తుది కీ విడుదల.. KEY కోసం క్లిక్‌ చేయండి

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 4 పరీక్ష తుది కీ విడుదలైంది. తుది కీని ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు.

Updated : 06 Oct 2023 21:25 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 తుది ‘కీ’ (TSPSC Group 4 final Key) విడుదలైంది. ఈ ‘కీ’ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) శుక్రవారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆగస్టు 28న గ్రూప్‌-4 పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల చేసిన అధికారులు.. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీతో వెరిఫై చేయించి తాజాగా  (TSPSC Group 4 final Key)తుది కీ విడుదల చేశారు. పేపర్‌ 1లో ఏడు ప్రశ్నలు తొలగించిన అధికారులు.. 8 ప్రశ్నలకు ఆప్షన్‌ మార్చారు. అలాగే, పేపర్‌ 2లో రెండు ప్రశ్నలు తొలగించి.. ఐదు ప్రశ్నలకు ఆప్షన్‌ మార్పు చేశారు. తెలంగాణలో గ్రూప్‌-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల నియామకానికి సంబంధించి రాత పరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2) జులై 1న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. 80శాతం మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. 

గ్రూప్‌ -IV పేపర్‌ -1 Final Key కోసం క్లిక్‌ చేయండి

గ్రూప్‌ -IV పేపర్‌ -2 Final Key కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని