రాబందులకు రాజు!
హాయ్ ఫ్రెండ్స్.. అడవికి రాజు సింహం అని మనందరికీ తెలుసు. అలాగే పక్షుల్లోనూ రాబందులు శక్తివంతమైనవని చదువుకొనే ఉంటారు. వాటిలో ‘ఏషియన్ కింగ్ వల్చర్’గా పిలిచే ఓ రాబందు చాలాకాలం తర్వాత కనిపించింది. ఆ వివరాలే ఇవి..
ఉత్తరప్రదేశ్‌లోని దుధ్వా నేషనల్ పార్కు పరిధిలో ఆసియా ప్రాంతంలో రాబందులకు రాజుగా పిలుచుకునే పక్షిని అధికారులు ఇటీవల గుర్తించారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ జాతి పక్షులు కనిపించాయట. సాధారణ రాబందులకు భిన్నంగా వీటి మెడ భాగం ఎరుపు రంగులో ఉంటుంది. దాంతోపాటు కొన్ని ఇతర లక్షణాలు కలిగి ఉండటంతో అందరూ దీన్ని ‘ఏషియన్ కింగ్ వల్చర్’ అని పిలుస్తుంటారు.
భారీ రెక్కలు..
ఈ ఎరుపు రంగు మెడ కలిగిన రాబందులు.. సాధారణంగా 76 నుంచి 86 సెంటీమీటర్ల పొడవు, 3.5 నుంచి 6.3 కిలోల వరకూ బరువు పెరుగుతాయట. అంతేకాదు నేస్తాలూ.. వీటి రెక్కలు 1.99 నుంచి 2.6 మీటర్ల వెడల్పు ఉంటాయి. పెద్ద వాటి మెడ ముదురు ఎరుపు రంగులో, పిల్ల పక్షుల్లో కొంచెం లేత వర్ణంలో ఉంటుంది. శరీరం మొత్తం నలుపు రంగు ఈకలతో మెరుస్తుంటుంది. మగ పక్షుల కనుగుడ్లు లేత తెలుపు రంగులో ఉంటే, ఆడ వాటివి డార్క్ బ్రౌన్‌లో ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉత్తర భారతదేశంలోనే కనిపిస్తుంటాయి. ఇవి ఆఫ్రికా, అరేబియా ప్రాంతాల్లో కనిపించే రాబందుల్లానే ఉంటాయట.
సంఖ్య తగ్గుతూ..
వివిధ కారణాల వల్ల ఈ రాబందుల రాజు జాతి పక్షుల సంఖ్య 2004 నుంచి క్రమక్రమంగా తగ్గడం ప్రారంభమైంది. దాంతో ఎలాగైనా ఈ జాతిని పరిరక్షించాలని 2007లో వాటిని అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. అంతేకాదు.. వాటి సంఖ్యను పెంచేందుకు, దుధ్వా నేషనల్ పార్కులో ప్రత్యేకంగా పునరుత్పత్తి కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. ఇవి ఎక్కడపడితే అక్కడ నివసించవు నేస్తాలూ.. సముద్రమట్టానికి దాదాపు 3000 మీటర్ల ఎత్తైన ప్రాంతాల్లోనే జీవిస్తాయట. రాబందులు సాధారణంగా జంతు కళేబరాలను తింటూ, పర్యావరణాన్ని కలుషితం కాకుండా తోడ్పడుతుంటాయి.
చెట్టుపైన కూర్చొని..
ఇటీవల విపిన్ కుమార్ అనే ఓ పరిశోధకుడు సోనారిపుర్ రేంజ్ అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుంటే.. ఓ పెద్ద చెట్టుపైన ఈ ఎరుపు రంగు మెడ కలిగిన రాబందు కూర్చొని కనిపించిందట. అది చాలా అరుదైనదని గుర్తించిన ఆయన, వెంటనే దాని కదలికలను వీడియో తీశాడు. ఆ వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయడంతో విషయం బయటకు తెలిసింది. నేస్తాలూ.. ఇవీ ‘ఏషియన్ కింగ్ వల్చర్’ విశేషాలు!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: విరాట్ ‘జెర్సీ నంబరు 18’ వెనుక.. కన్నీటి కథ
-
Movies News
Farzi: ఓటీటీలో రికార్డు సృష్టించిన షాహిద్‌కపూర్ ‘ఫర్జీ’..!
-
General News
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Selfie: సెల్ఫీలు తీసుకున్న గాంధీ, థెరెసా, చెగువేరా
-
India News
Kerala: మహిళల వేషధారణలో పురుషుల పూజలు