నా పేరు డెవిల్!
చూడ్డానికి కాస్త పందికొక్కులా, ఇంకాస్త ముంగిసలా... ఇంకా ఓ చిన్న ఎలుగుబంటిలా కనిపిస్తున్న నా పేరేంటో తెలుసా?.. ‘ఆశ.. దోశ.. అప్పడం.. వడ...’ అన్నీ ఇక్కడే చెప్పేస్తానా ఏంటి?
చూడ్డానికి కాస్త పందికొక్కులా, ఇంకాస్త ముంగిసలా... ఇంకా ఓ చిన్న ఎలుగుబంటిలా కనిపిస్తున్న నా పేరేంటో తెలుసా?.. ‘ఆశ.. దోశ.. అప్పడం.. వడ...’ అన్నీ ఇక్కడే చెప్పేస్తానా ఏంటి? ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది సరేనా! అయితే ఇంకెందుకాలస్యం ఓ పట్టు పట్టేయండి..!
నా పేరు టాస్మానియన్ డెవిల్. నేను నల్లగా, చూడ్డానికి భయంకరంగా, దెయ్యంలా ఉంటాను కాబట్టే నన్ను డెవిల్ అని పిలుస్తారు. నేను నిజానికి టాస్మానియాకే పరిమితమైన జీవిని. కానీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనూ జీవిస్తున్నాను తెలుసా. మీ మనుషులే నన్ను తీసుకొచ్చి ఆస్ట్రేలియాలో వదిలేశారు.
చిన్ని కుక్కలా...
నేను చిన్ని కుక్క పిల్ల పరిమాణంలో ఉంటాను. నేను కూడా అచ్చం కుక్కలానే బ్రహ్మాండంగా వాసన పసిగట్టగలను. నాకున్న బలమైన మెడ, తల సాయంతో చక్కగా వేటాడగలను. మీకు మరో విషయం తెలుసా... నేను ఎంచక్కా చెట్లు కూడా ఎక్కగలను. మాకూ కంగారూలకు ఉన్నట్లే పొట్టకు సంచి ఉంటుంది.
ముందు కాళ్లు పెద్దవి...
నా వెనక కాళ్లకంటే ముందు కాళ్లు కాస్త పెద్దగా ఉంటాయి. తోకేమో నా శరీరంలో సగం ఉంటుంది. నేను గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలను. మేం చాలా వరకు నల్లగా ఉంటాం. కానీ మాలో కొన్నింటికి కాస్త అక్కడక్కడ తెల్లని జుట్టు కూడా ఉంటుంది.
అయిదేళ్లే మాకు నిండు నూరేళ్లు...
మేం దాదాపు 6 కిలోల వరకు బరువు తూగుతాం. అయిదేళ్ల వరకు జీవిస్తాం. అయితే మాలో ఏడేళ్లకంటే ఎక్కువ జీవించినవీ ఉన్నాయి. అన్నట్లు మీకు ఓ తమాషా విషయం చెప్పనా... మిగతా జీవుల్లా కాకుండా మేం మా కొవ్వును తోకలో దాచుకుంటాం. మేం చిన్న చిన్న జంతువులను వేటాడి మా కడుపు నింపుకొంటాం.
గట్టిగా కరుస్తాం...
మేం కేవలం మా రంగు, ఆకారంతోనే మిమ్మల్ని భయపెట్టం. గట్టిగా కరవగలం కూడా.. మా దంతాలు చాలా పదునుగా, పొడవుగా ఉంటాయి. అలాగే బలమైన దవడలు కూడా ఉంటాయి. అందుకే మేం కరిచామంటే మీకు చుక్కలు కనిపిస్తాయి. అన్నట్లు చెప్పడం మరిచిపోయా.. మాకు 42 దంతాలుంటాయి. మమ్మల్ని పెంచుకుందామని అనుకుంటున్నారేమో.. ఆ పప్పులేమీ ఉడకవు. మేం అసలు మీకు పెంపుడు జంతువులుగా ఉండలేం తెలుసా. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది బై...బై...!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Pattabhi: ఉద్యోగులకు మళ్లీ అన్యాయమే: పట్టాభి
-
India News
NIA: ఖలిస్థాన్ ‘టైగర్ ఫోర్స్’పై ఎన్ఐఏ దృష్టి.. 10 చోట్ల ఏకకాలంలో దాడులు
-
General News
TS Government: ₹లక్ష ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకోండిలా..
-
World News
Imran Khan: ఇక పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు..!
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. విద్యుత్ షాక్‌తోనే 40 మంది మృతి..!
-
Movies News
village backdrop movies: కథ ‘ఊరి’ చుట్టూ.. హిట్ కొట్టేట్టు!