ఆవు సాయం!

Eenadu icon
By Features Desk Published : 01 Nov 2025 01:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఒక ఊరి చివర వాగు వేగంగా ప్రవహిస్తోంది. ఆ సమయంలోనే ఒక ఆవు మెల్లగా ఆ వాగు దాటడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడే దానికి ‘ఎవరైనా నన్ను కాపాడండి.. కాపాడండి’ అనే మాటలు వినిపించాయి. ఎవరా అనుకుంటూ అటూఇటూ చూడసాగింది ఆవు. అంతలోనే దానికి కాస్త దూరంలో.. వరదలో కొట్టుకొస్తున్న పాము కనిపించింది. ‘అరెరె.. పాపం పాము వరదలో పడిపోయినట్లుంది. ఎలాగైనా దాన్ని కాపాడాలి’ అనుకుంది ఆవు. ఆ వరదకు ఎదురుగా తలను పెట్టి, దాని మీదకు ఆ పాము ఎక్కేలా చేసింది. మెల్లగా ఆవు మీదకు పాకి.. కొమ్ములను చుట్టుకుని కూర్చుంది. అప్పుడు పాము.. ‘నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు మిత్రమా!’ అంది. ‘అంత చిన్నదానికి ధన్యవాదాలు ఎందుకు మిత్రమా! ఆపదలో ఉన్నవారిని రక్షించడం మనందరి బాధ్యత. నేనూ అదే చేశాను. ఉండు.. నిన్ను జాగ్రత్తగా అవతలి ఒడ్డుకు చేర్చుతాను’ అని బదులిచ్చింది ఆవు. అన్నట్లుగానే వరదలో మెల్లగా నడుస్తూ ఆవు ఒడ్డు చేరింది. పాము సంతోషంగా కిందకు దిగి.. ‘నా ప్రాణాలు కాపాడినందుకు, నన్ను ఒడ్డుకు చేర్చినందుకు నీకు మరోసారి ధన్యవాదాలు మిత్రమా! నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను’ అంటూ ఆవుని ప్రేమగా ముద్దాడి వెళ్లిపోయింది. ఆ తరవాత కొన్ని నిమిషాల్లోనే ఆవు విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయింది. దుష్టుల ప్రేమ కూడా చాలా ప్రమాదకరం మరి!  వారికి సాయపడినా అది.. చివరికి మనకే హాని చేస్తుంది! 

చంద్ర ప్రతాప్‌ కంతేటి  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు