Moral Story: అలా ఎలా చెప్పాడు!

Eenadu icon
By Features Desk Published : 29 Oct 2025 01:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

త్నగిరి రాజ్యానికి ప్రధాన గూఢచారిని నియమించాలి అనుకున్నాడు రాజు. రాజ్యంలో అందుకు తగిన వాళ్లందరినీ పిలిచి కొన్ని పోటీలు నిర్వహించాడు. అందులో ముగ్గురు యువకులు చివరి దశకు చేరుకున్నారు. వాళ్లలో ప్రధాన గూఢచారిని ఎంచుకునేందుకు మరో పరీక్ష పెడుతున్నట్లు చెప్పాడు మంత్రి. ఆ ముగ్గురినీ ఒక గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు రామన్న, భీమన్న, చాయన్నలను చూపించి.. ‘వాళ్ల చేతిలో ఉన్న డబ్బాలో డబ్బులున్నాయి. ఇద్దరి డబ్బాల్లో సమానంగా ఉన్నాయి. ఒకరి దగ్గర మాత్రం తక్కువగా ఉన్నాయి. ఎవరి దగ్గర తక్కువ డబ్బుందో చెప్పండి. తప్పు సమాధానం చెబితే చావకొడత చూసుకోండి మరి’ అన్నాడు. ఎంత ఆలోచించినా ఎవరి దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయో ఊహించలేకపోయారు. ‘తప్పు సమాధానం చెప్పి.. దెబ్బలు తినే కంటే చెప్పకుండా వెళ్లిపోవడమే మంచిది’ అని ఆ పోటీలోంచి ఇద్దరు వ్యక్తులు తప్పుకొన్నారు. కానీ మూడో వ్యక్తి అక్కడే నిలబడి కాసేపు ఆలోచించి.. ‘చాయన్న దగ్గర కొంత డబ్బు తక్కువ ఉంది’ అని చెప్పాడు. అప్పుడు మూడు డబ్బాలు లెక్కిస్తే.. అతను చెప్పినట్లు చాయన్న దగ్గరే తక్కువ డబ్బు ఉంది. ‘అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగావు’ అని అడిగాడు మంత్రి. ‘మీ మాటల్లో ‘చావకొడత’ అన్న పదాన్ని తీసుకున్నాను. చాయన్న పేరులోని మొదటి అక్షరాన్ని చూశాను. అలా నాకు సమాధానం దొరికింది’ అన్నాడా మూడో వ్యక్తి. ‘గూఢచారికి ముఖ్యంగా కావాల్సింది రహస్య సంకేతాలను అర్థం చేసుకునే లక్షణం. అది నీకు చాలా ఉంది. కాబట్టి నువ్వే ఈ ఉద్యోగానికి తగిన వ్యక్తివి’ అని ప్రకటించాడు మహారాజు. 

కొమ్ముల వెంకట సూర్యనారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు