మెరుపుల వెండి.. కబుర్లు వినండి!
వెండిని చూసుంటారు... దాంతో తయారైన ఆభరణాలు వేసుకుని ఉంటారు... మరి దాని వల్ల ఇంకేమైనా లాభాలున్నాయా? అసలది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ విషయాలేమైనా తెలుసా? తెలియకపోతే చదివేయండి గబగబా!
వెండి... దీన్ని ఆంగ్లంలో సిల్వర్ అంటారు. ఇదొక రసాయన మూలకం. లాటిన్ భాషలో వెండిని ఆర్జెంటమ్ అంటారు. అందుకే దీన్ని Ag అనే సంకేతంతో సూచిస్తారు. దీని పరమాణు సంఖ్య : 47
* రాగి, సీసం, బంగారం, జింక్ వంటి వాటిని శుద్ధి చేసినప్పుడు ఉప ఉత్పత్తిగా వెండి లభిస్తుంది.
* క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాటి వెండి వస్తువులు గ్రీసులో దొరికాయి.
ఎన్ని రకాలో!
వెండి అనగానే మనకు ఒకటే గుర్తుకు వస్తుంది. కానీ దీంట్లో ముఖ్యంగా 8 రకాలున్నాయి.
* .999 ఫైన్ సిల్వర్. ఇది స్వచ్ఛమైన వెండికి అతి దగ్గరగా ఉంటుంది.
* స్టెర్లింగ్ సిల్వర్. దీన్ని .925 సిల్వర్ అంటారు.
* ఆర్జెంటమ్ సిల్వర్. చిలుము పట్టని వెండి మిశ్రమలోహం ఇది. 92.5 శాతం వెండి ఉండి మిగిలిన శాతం ఇతర లోహాలు మిశ్రమమై ఉంటాయి.
* కాయిన్ సిల్వర్ * సిల్వర్ * సిల్వర్ ఫిల్డు * సిల్వర్ ప్లేటెడ్ * నికెల్ సిల్వర్
భలే గొప్పలు!
* అన్ని లోహాల కన్నా వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకం, ఉష్ణవాహకం.
* వెండి అయాన్లు, సమ్మేళనాలు, బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగైలను నాశనం చేస్తాయి. అందుకే నీటిని శుద్ధి చేయడంలో, ఫిల్టర్ చేయడంలో వెండి ఎంతగానో సాయపడుతుంది.
* పారిశ్రామికంగా వెండిని పదివేల రకాలుగా వినియోగించుకుంటున్నారు.
* ఇటీవల వెలుగులోకి వచ్చిన నానో కణాల ఆవిష్కరణతో గృహోపకరణాల్లో నానోసిల్వర్ చాలా రకాలుగా తన సేవలు అందిస్తోంది. సిల్వర్ నానో తీగలు... అనేక రకాల రోగాలను నిర్ణయించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.
* మెర్క్యురీ విష ప్రభావానికి ఇది విరుగుడుగా పనిచేస్తుంది.
* తలుపులకు ఉండే చేతి పిడులు ఇప్పుడు వెండి కోటింగ్‌తో వస్తున్నాయి. ఈ వెండి కోటింగ్ వల్ల బ్యాక్టీరియా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందలేదు.
* డీవీడీల్లోని సమాచారం ఎక్కువకాలం, ప్రతిభావంతంగా నిల్వ ఉండటానికి వాటిపై అతి పలుచని వెండిపొరలు ఏర్పాటు చేస్తున్నారు.
* సూపర్ కండక్టర్స్ (అతివాహకాలు)కు వెండి జోడించడంతో విద్యుత్ ప్రసారాలు అత్యంత ప్రతిభావంతంగా జరుగుతున్నాయి.
* సోలార్ ప్యానల్స్‌లో ఒక్కొక్క దానిలో 20 గ్రాముల సిల్వర్‌ను ఉపయోగిస్తున్నారు.
* సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీల తయారీలో వెండిని వాడుతున్నారు. ఈ బ్యాటరీలు వినికిడి పరికరాలు, వాచీలు ఇంకా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాడుతున్నారు.
* పాలిస్టర్ పొరలపై సిల్వర్‌ను కలిపి కిటికీలకు తగిలిస్తున్నారు. దీని వల్ల లోపలికి వచ్చే కాంతి తీవ్రత బాగా తగ్గుతుంది.
* కారు ఇంజన్ బేరింగ్‌లకు వెండిని ఉపయోగిస్తున్నారు. ఇది ఇంజన్ పుట్టించే వేడిని తట్టుకోగల్గడమేగాక ఘర్షణను బాగా తగ్గిస్తోంది.
* దంత వైద్య చికిత్సలో, ఎల్‌ఈడీ చిప్స్ తయారీలో, ఔషధాలు, న్యూక్లియార్ రియాక్టర్లు, సెమీకండక్టర్లు, టచ్ స్క్రీన్స్ వంటి పరికరాల్లో విశేషంగా ఉపయోగిస్తున్నారు.
1. నాజూకు వెండి: (.999 ఫైన్ సిల్వర్): ఇది 99.9 శాతం స్వచ్ఛం. మిగిలిన 0.1 శాతం పెద్దగా నాణ్యతలేని ఇతర మూలకాల జాడలు ఉంటాయి.
* ఈ నాజూకు వెండి స్టెర్లింగ్ సిల్వర్‌కి ఉండే మెరుపు పాలిష్ కన్నా ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది.
* ఈ వెండి బాగా మెత్తగా ఉండటం వల్ల చక్కగా సాగుతుంది. సులువుగా సొట్టలు పడుతుంది. అందుకే వెండి ఆభరణాల్లో చాలా వాటి తయారీకి పనికి రాదు. ఎందుకంటే ఈ వెండితో తయారైన ఆభరణాల జీవితకాలం తక్కువ. సులువుగా గీతలు, సొట్టలు పడి ఆకృతిని కోల్పోతాయి. కానీ చెవి రింగులు, నెక్లస్ వంటి ఆభరణాలు చేయడానికి పనికి వస్తుంది.
2. స్టెర్లింగ్ సిల్వర్: అమెరికా, యూరప్ ఇంకా ప్రపంచంలోని అనేక దేశాలు దీన్ని వాణిజ్యపరంగా ప్రామాణికమైన వెండిగా పరిగణిస్తారు.
* ఇది 92.5 శాతం వెండి... మిగిలిన 7.5 శాతం రాగి కలిపిన మిశ్రమలోహం.
* దీనిలో ఇతర లోహాల్ని కలపడం వల్ల ఈ వెండికి మంచి గట్టితనం వస్తుంది. ఎక్కువకాలం మన్నుతుంది. అంతేకాదు... కొనుగోలు దారులను ఆకర్షించే కాంతులతో ప్రకాశవంతంగా ఉంటుంది.
* ఈ వెండి ఎంత కాంతిమంతంగా ఉన్నా చిలుము పడుతుంది. పాలిష్ పదార్థాలతో కొంతకాలం చిలుము పట్టకుండా ఆకర్షణీయంగా ఉండేటట్లు కాపాడుకోవచ్ఛు ఎక్కువ రకం ఆభరణాలు ఈ స్టెర్లింగ్ వెండితోనే చేస్తారు.
- డాక్టర్ సి.వి. సర్వేశ్వర శర్మ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ఐపీఎల్లో ఏంటీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్..?
-
Politics News
BJP vs Congress: ‘రాహుల్జీ మీకు ధన్యవాదాలు’.. జర్మనీపై దిగ్విజయ్ ట్వీట్‌కు భాజపా కౌంటర్!
-
Sports News
Best Fielder: ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ అతడే: జాంటీ రోడ్స్
-
India News
Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు
-
Movies News
Pathu Thala: వారికి థియేటర్లోకి నో ఎంట్రీ.. వీడియో వైరల్..
-
Politics News
Bandi sanjay: కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్