గిటార్‌ చేప.. అనే నేను!

హాయ్‌ నేస్తాలూ...! ఎలా ఉన్నారు. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీకు శీర్షిక చదవగానే అర్థమై ఉంటుంది. నేనో చేపను అని. కానీ మామూలు చేపను కాదు. నేను గిటార్‌ చేపను. గిటార్‌

Published : 19 Jan 2022 00:05 IST

హాయ్‌ నేస్తాలూ...! ఎలా ఉన్నారు. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీకు శీర్షిక చదవగానే అర్థమై ఉంటుంది. నేనో చేపను అని. కానీ మామూలు చేపను కాదు. నేను గిటార్‌ చేపను. గిటార్‌ ఆకారంలో ఉంటాను కాబట్టే.. నన్ను అలా పిలుస్తారు. ఇంకా నా విశేషాలు ఏంటంటే...

నిజానికి నేను కాస్త అరుదైన చేపను. పెద్దగా బాహ్యప్రపంచానికి కనిపించను. ఈ మధ్య ఓ అయిదారు గిటార్‌ చేపలు గోవా తీరంలో జాలర్లకు చిక్కాయి. అప్పుడు నా గురించి కొంతమందికి తెలిసింది. మీకు తెలిసి ఉండకపోవచ్చు అనిపించింది. అందుకే చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను.


సగం షార్క్‌ను.. సగం ‘రే’ను..

నన్ను చూస్తే సగం షార్క్‌లా.. సగం ‘రే’ చేపలా ఉంటాను. తోక భాగం షార్క్‌ను పోలి ఉంటుంది. తల భాగమేమో ‘రే’ చేపలా ఉంటుంది. మొత్తంగా చూస్తే నా శరీరం గిటార్‌ ఆకృతిలో ఉంటుంది. అందుకే నన్ను గిటార్‌ ఫిష్‌ అంటారు.


పీతలంటే ప్రీతి..

నేను ప్రధానంగా సముద్ర చేపను అయినప్పటికీ, మాలో కొన్ని రకాలు మంచినీటిలోనూ నివసిస్తాయి. మరి కొన్ని బ్యాక్‌వాటర్స్‌లో కనిపిస్తాయి. నేను ఎక్కువగా పీతలు, చిన్న చిన్న పురుగులు, నత్తలను ఆహారంగా తీసుకుంటాను.


ఆరడుగుల బుల్లెట్టు!

నేను పూర్తిగా ఎదిగితే రెండు మీటర్ల వరకు అంటే ఆరుఅడుగుల వరకు పెరుగుతాను. నీటిలో చాలా నెమ్మదిగా ముందుకు కదులుతాను. ఏదైనా ఆపద ఎదురైతే కాస్త వేగంగానూ కదలగలను. ఎక్కువగా తీరప్రాంతాలకు దగ్గర్లో నివసిస్తుంటాను. కానీ ఇసుక పొరల్లో బతుకుతాను కాబట్టి ఎక్కువగా ఎవరికీ కనిపించను. వలలకు కూడా పెద్దగా చిక్కను. మమ్మల్ని కొన్ని ప్రాంతాల్లో ఆహారంగానూ తీసుకుంటారు. ఫ్రెండ్స్‌.. ప్రస్తుతానికి ఇవే నా విశేషాలు. ఇక ఉంటా మరి బై.. బై..!గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని