ముగ్గురు మిత్రులు!
హాయ్ ఫ్రెండ్స్.. ప్రభుత్వ బడుల్లో దాదాపు పేద విద్యార్థులే చదువుతుంటారనీ, వారి వద్ద కనీస సామగ్రీ ఉండదని మీకు తెలిసే ఉంటుంది. అటువంటి పేద పిల్లల కష్టాలను కళ్లారా చూసిన ముగ్గురు విద్యార్థులు.. వారికోసం ఏదైనా చేయాలనుకున్నారు. ఆ చిరు ఆలోచనే, ఇప్పుడు రాష్ట్రాలు దాటుతూ.. ఎంతోమంది చిన్నారుల చదువుకు అండగా నిలుస్తోంది. ఇంతకీ ఆ ముగ్గురు విద్యార్థుల బృందం ఏం చేసిందో తెలుసుకుందామా..!
జిగిషా, కెల్విన్ రిచర్డ్, నందిక.. ఈ ముగ్గురూ మంచి స్నేహితులు. ప్రస్తుతం కళాశాల విద్య చదువుతున్న వీరిది కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు. ప్రైవేటు స్కూళ్లు, అపార్ట్‌మెంట్ సముదాయాల నుంచి పాఠ్య పుస్తకాలతోపాటు నోట్ బుక్స్‌ను సేకరిస్తూ.. ప్రభుత్వ బడుల్లోని పేద విద్యార్థులకు వాటిని ఉచితంగా అందిస్తున్నారు.
కేవలం పాఠాలు వినడమే..
గతేడాది ఒకరోజు ఈ ముగ్గురు స్నేహితులు కాలేజీ ప్రాజెక్టు పని నిమిత్తం ఓ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారట. అక్కడ విద్యార్థుల చేతుల్లో పాఠ్య పుస్తకాలు మాత్రమే కనిపించాయి. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను రాసుకునేందుకు నోట్ బుక్స్ లేకపోవడంతో వారందరూ కేవలం వింటూ కూర్చున్నారు. తరగతి గదిలో విన్న అంశాలన్నీ, అందరికీ ఇంటికెళ్లాక గుర్తుండకపోవచ్చు కదా.. ఈ ముగ్గురికి కూడా అదే సందేహం వచ్చింది. దాంతో ఆ బడి విద్యార్థులకు నోట్ బుక్స్ అందించాలని అక్కడికక్కడే నిర్ణయించుకున్నారు. దీనికి వాళ్లు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకున్నారు.
వేలాది పుస్తకాలు..
గతేడాది జూన్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ 4,500 పాఠ్య పుస్తకాలు సేకరించారట. వాటిని స్థానిక గ్రంథాలయాలకు అందజేయడంతోపాటు నోట్ బుక్స్‌ని సర్కారు బడుల్లోని పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. అదనంగా ఉన్న పాఠ్య పుస్తకాలను తెల్ల కాగితాలుగా రీసైకిల్ చేయిస్తున్నారు. ఆ కాగితాలను నోట్ బుక్స్‌గా మారుస్తూ.. ఇప్పటివరకూ రెండున్నర టన్నుల ముడి కాగితాన్ని వృథా కాకుండా చూశారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును పశ్చిమ బెంగాల్, దిల్లీ, హరియాణా రాష్ట్రాలకూ విస్తరించనున్నట్లు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మొదట్లో వీరు ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్ల అపాయింట్‌మెంట్ కోసం చాలా ఇబ్బందులు పడ్డారట. ఒకసారి వారిని కలిసి, తమ కార్యక్రమ వివరాలు చెప్పగానే.. అందరూ బాగా సహకరించారని ఈ ముగ్గురు మిత్రులు చెబుతున్నారు. నేస్తాలూ.. ఈ అక్కలు, అన్నయ్య చేస్తున్న పనిని ఎవరైనా అభినందించాల్సిందే కదూ.!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KVP: చంద్రబాబు ముందుంటే వెనక నడుస్తాం!
-
Sports News
Virender Sehwag: ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్
-
Crime News
Software Engineer: చంద్రగిరిలో దారుణం.. కారులో వెళ్తుండగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ సజీవ దహనం
-
India News
Kamal Anand: రూ.60 కోసం పదేళ్లు పోరాటం
-
India News
Arvind Kejriwal: మోదీ విద్యార్హతపై అనుమానం పెరిగింది: కేజ్రీవాల్
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ