పదేళ్లకే ‘పది’ పూర్తి!

నోయిడాకు చెందిన అయాన్‌ గుప్తా వయసు పదేళ్లు. ఈ ఏడు జరిగిన పదోతరగతి పరీక్షల్లో 76.67 శాతం మార్కులు సాధించి అందరూ అవాక్కయ్యేలా చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోనే అత్యంత పిన్న వయసులో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాడు.

Updated : 28 Apr 2023 04:21 IST

నోయిడాకు చెందిన అయాన్‌ గుప్తా వయసు పదేళ్లు. ఈ ఏడు జరిగిన పదోతరగతి పరీక్షల్లో 76.67 శాతం మార్కులు సాధించి అందరూ అవాక్కయ్యేలా చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోనే అత్యంత పిన్న వయసులో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాడు. నిజానికి 14 సంవత్సరాలు నిండకుండా పదో తరగతి పరీక్షలు రాయడానికి అనుమతించరు. కానీ వీళ్ల స్కూలు ప్రిన్సిపల్‌ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ విద్యార్థితో పదోతరగతి పరీక్ష రాయించారు. కరోనా సమయంలో అయాన్‌గుప్తా తన తరగతి పుస్తకాలు పక్కన పడేశాడు. పెద్ద తరగతులకు చెందిన పుస్తకాలను ఎంతో ఇష్టంగా చదవడం ప్రారంభించాడు. దీన్ని గుర్తించిన తల్లిదండ్రుల ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ప్రిన్సిపల్‌, అయాన్‌ పదేళ్ల వయసులోనే పదో తరగతి రాయడానికి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అనుకున్నట్లుగానే మంచి ఉత్తీర్ణత సాధించి వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. భవిష్యత్తులో ఇంజినీర్‌ కావడమే తన లక్ష్యం అని చెబుతున్నాడీ అయాన్‌. కేవలం చెప్పడమే కాదు జేఈఈ, ఇతర ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల కోసం శ్రద్ధగా చదువుతున్నాడు కూడా. మరి మన అయాన్‌ అనుకున్నది సాధించాలని మనందరమూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు