ఆరగించాలంటే.. ఆగాల్సిందే!
హలో ఫ్రెండ్స్.. మనం ఏదైనా హోటల్‌కి వెళ్లామనుకోండి.. అక్కడ కాస్త రద్దీ ఎక్కువగా ఉండి.. టేబుల్ ఖాళీ అయ్యే వరకూ ఎదురుచూడాల్సి వస్తే... మరో రెస్టరంట్‌కి వెళ్దామని ఆలోచిస్తుంటాం. ఈ ప్రస్తావన ఎందుకూ అంటే.. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌పాట్ రెస్టరంట్ గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి.. మరి, ఆ వివరాలేంటో చదివేయండి..
హలో ఫ్రెండ్స్.. మనం ఏదైనా హోటల్‌కి వెళ్లామనుకోండి.. అక్కడ కాస్త రద్దీ ఎక్కువగా ఉండి.. టేబుల్ ఖాళీ అయ్యే వరకూ ఎదురుచూడాల్సి వస్తే... మరో రెస్టరంట్‌కి వెళ్దామని ఆలోచిస్తుంటాం. ఈ ప్రస్తావన ఎందుకూ అంటే.. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌పాట్ రెస్టరంట్ గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి.. మరి, ఆ వివరాలేంటో చదివేయండి..
చైనాలోని చాంగ్వింగ్ నగర శివారులో ‘పిపా యువన్’ అనే రెస్టరంట్ ఒకటుంది. దాదాపు కొండ కింద నుంచి పైవరకూ ఉన్న ఆ హోటల్ ‘ప్రపంచంలోనే అతి పెద్ద హాట్ పాట్ రెస్టరంట్’ అట. అంటే.. అక్కడ ప్రతి టేబుల్ దగ్గర పదార్థాలను వేడి వేడిగా ఆరగించేందుకు ఓ చిన్నపాటి పొయ్యి ఉంటుందట. ఇటీవల ఇది ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోకి కూడా చేరిపోయింది.
బుక్ చేసుకుంటేనే తినగలం
ఈ రెస్టరంట్ నగరానికి కాస్త దూరంగా ఓ పెద్ద కొండను ఆనుకొని ఉంటుంది. దాదాపు 3,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో మొత్తం 900 టేబుళ్లు ఉన్నాయట. ఒకేసారి సుమారు 6000 మంది తినగలిగే సామర్థ్యం దీనిసొంతం. ఇది కొండ వెంబడి ఉండటంతో పార్కింగ్ ప్రాంతం నుంచి డైనింగ్ ఏరియాకు నడిచి వెళ్లేందుకు దాదాపు 30 నిమిషాలు పడుతుందట. అంతేకాదు.. ఇక్కడ ముందే టేబుల్ బుక్ చేసుకోవాలి. ఎలాంటి బుకింగ్ లేకుండా వెళ్తే, ఎంత సేపు ఎదురుచూసినా మనకు టేబుల్ దొరకదన్నమాట. ఇంకో విషయం ఏంటoటే.. ఇక్కడ మన టేబుల్ దగ్గరకు వెళ్లాలన్నా కూడా దారి వెతుక్కోవాల్సిందే!
బాబోయ్.. అంతమందా..
మరి ఒకేసారి ఆరు వేల మంది తినగలరంటే.. వంట చేసేందుకు, వడ్డించేందుకు, ఇతర పనులకు ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారో ఊహించడమూ కష్టమే. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భోజనప్రియుల కోసం ఈ రెస్టరంట్‌లో వందల సంఖ్యలో వెయిటర్లు, పదుల సంఖ్యలో చెఫ్‌లు, డజన్లకొద్దీ వంట సహాయకులు, 25 మంది క్యాషియర్లు నిత్యం పనిచేస్తుంటారట. వీళ్లు కాకుండా.. పాత్రలు కడిగేందుకు, పరిసరాలను శుభ్రం చేసేందుకు, ఇతర పనులకు వందలాది మంది విధులు నిర్వర్తిస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వారంతా దాదాపు ఈ హోటల్‌లోనే పనిచేస్తుంటారట.
రాత్రిళ్లే సందడి..
దాదాపు ఒక చిన్న దేశంలోని జనాభాకు ఆతిథ్యం ఇవ్వగల ఈ హోటల్‌కు పగలు కంటే రాత్రి వేళల్లోనే ఎక్కువ మంది వస్తుంటారట. రంగురంగుల విద్యుత్తు దీపాల వెలుగుల మధ్యలో కొండ అందాలను ఆస్వాదిస్తూ ఎంచక్కా భోజనం చేయవచ్చు. అందుకే, ఆర్డర్ ఇచ్చిన పదార్థాలు రావడం కాస్త ఆలస్యమైనా సరే.. పర్యాటకులు పెద్దగా పట్టించుకోరని నిర్వాహకులు చెబుతున్నారు. తాజా సామగ్రి, సరిపడా మసాలాలు దట్టించి నోరూరించేలా ఇక్కడి చెఫ్‌లు చేసే వంటలకు ఎవరైనా ఫిదా కావాల్సిందేనట. నేస్తాలూ.. ఇవీ ఈ హాట్‌పాట్ రెస్టరంట్ విశేషాలు.. భలే ఉన్నాయి కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dhoni - CSK: ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్’ ధోనీకి వర్తించదట.. కారణం చెప్పిన సెహ్వాగ్!
-
India News
IAF: వాయుసేన అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
-
Sports News
Sachin - Gill: గిల్లో ఆ లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి: సచిన్
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’.. వాళ్లు కచ్చితంగా చూడాల్సిన చిత్రం: కృతి సనన్
-
World News
China: రేపు అంతరిక్షంలోకి పౌర వ్యోమగామి.. ఏర్పాట్లు సర్వం సిద్ధం..!
-
General News
Isro-Sriharikota: నింగిలోని దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్12.. ప్రయోగం విజయవంతం