నవ్వుల్‌..నవ్వుల్‌..!

బంటి: స్కూళ్లు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటావు కిట్టూ..?

Published : 08 Oct 2023 01:55 IST

సెలవుకు అర్థం..!

బంటి: స్కూళ్లు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటావు కిట్టూ..?
కిట్టు: సెలవులు ఇవ్వడం బంటీ..
బంటి: అదెలా?

కిట్టు: స్కూల్‌ ఉంటేనే కదా.. సెలవు అనే పదానికి అర్థం, సెలవు తీసుకోవడానికి కారణం ఉండేది.
బంటి: ఆఁ..!


వినిపించి.. తెలుసుకుంటా..!

టీచర్‌: చింటూ.. హోంవర్క్‌ రాయకుండా నిన్నంతా ఏం చేశావు?
చింటు: ఫోన్‌లో మా తమ్ముడి వాయిస్‌ రికార్డు చేశాను టీచర్‌..
టీచర్‌: ఎందుకు?

చింటు: ఇప్పుడు తను మాట్లాడే మాటలు నాకు అర్థం కావడం లేదు.. పెద్దయ్యాక వినిపించి, ఏం మాట్లాడాడో తెలుసుకుందామని టీచర్‌..!
టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని