ఎస్కలేటర్‌...ఎంత పొడవో!

చుట్టూ పచ్చటి కొండలు...కనువిందు చేసే ప్రకృతి అందాలు...ఏమాత్రం నడవకుండానే చూడొచ్చు...ఎలాగో తెలుసా? ప్రపంచంలోనే అతి పొడవైన ‘సైట్‌సీయింగ్‌ ఎస్కలేటర్‌’ ఎక్కి!

Published : 19 Oct 2016 01:11 IST

ఎస్కలేటర్‌...ఎంత పొడవో!

చుట్టూ పచ్చటి కొండలు...కనువిందు చేసే ప్రకృతి అందాలు...ఏమాత్రం నడవకుండానే చూడొచ్చు...ఎలాగో తెలుసా? ప్రపంచంలోనే అతి పొడవైన ‘సైట్‌సీయింగ్‌ ఎస్కలేటర్‌’ ఎక్కి!

స్కలేటర్‌ని షాపింగ్‌మాల్స్‌లో, రైల్వేస్టేషన్లలో, సినిమా థియేటర్లలో మీరెక్కే ఉంటారుగా. అలాంటి ఎస్కలేటర్‌ని ఓ దగ్గర కొత్తగా ఏర్పాటు చేశారు. అయితే దానికో ప్రత్యేకత ఉంది. ఏంటంటే, ఇది ఏకంగా 688 మీటర్ల పొడవుంది. అంటే దాదాపు 2,257 అడుగుల పొడవన్నమాట.

* మరి అంతపొడవున్న ఎస్కలేటర్‌పై ఓసారి ఎక్కేద్దామనుకుంటున్నారా? అయితే చైనాలోని హుబే ప్రావిన్స్‌కి బయలుదేరండి.

* అక్కడ ఎన్షి నగరంలోని ఎన్షి గ్రాండ్‌ కెనియన్‌ అనే పేద్ద లోయ దగ్గర ఉంటుందిది.

* పేద్ద పేద్ద పర్వతాలతో, చుట్టూ పచ్చని చెట్లతో ఉండే ఈ లోయలోని ప్రకృతి వింతల్ని చూడ్డానికి పర్యటకులు ఎప్పుడూ బారులు తీరుతుంటారు. వీరికోసం చెక్కలతో చేసిన నడక దారుల్ని కూడా కట్టారు. అయితే ఈ లోయ చూడ్డానికి ఎంతో నడవాల్సి వస్తుంది కదా. అందుకే ఆ బాధ లేకుండా ఉండటానికి, సందర్శకులు సులువుగా చూడ్డానికి ఈ సరికొత్త ఎస్కలేటర్‌ ఏర్పాటుచేశారు. ఇలా పర్యటకుల సందర్శన కోసం ఏర్పాటు చేసిన ఎస్కలేటర్లలో ఇదే ప్రపంచంలో పొడవైంది.

* ఈ లోయ పొడవునా ఉన్న ఈ ఎస్కలేటర్‌ని ఎత్తుపల్లాల్ని బట్టి కుడివైపుకి తిరిగిన ఆంగ్ల అక్షరం ‘ఎం’ M ఆకారంలో స్టీలు కాంక్రీట్‌, కలప ఉపయోగించి నిర్మించారు. పైన రక్షణ కోసం ప్రత్యేకమైన పైకప్పును కూడా కట్టారు.

* గంటకు 7,300 మంది ఈ ఎస్కలేటర్‌ ఎక్కి లోయ అందాల్ని చూడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని