Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 May 2024 09:08 IST

1. కళ్లు మూసుకున్నారా ఐదేళ్లు..

ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన వాగ్దానాలను బంగాళాఖాతంలో కలిపేశారు. దోచుకోవడం.. దాచుకోవడమే లక్ష్యంగా ఐదేళ్లు పాలన సాగించారు. ఇందుకు కొనసాగింపు ఇవ్వాలని కోరేందుకు శనివారం ఆయన పలమనేరు రానున్నారు. జిల్లా రైతాంగాన్ని, యువతను నట్టేట ముంచేసిన మోసకారి ఓట్లు అడిగేందుకు జిల్లాకు రావడంపై ప్రజలు మండిపడుతున్నారు. పూర్తి కథనం

2. అజీర్తి సమస్యకు మామిడి పండే ఔషధం!

పోషకాలకు, రుచికి పెట్టింది పేరైన మామిడి పండు.. అజీర్తి నివారణకు సహజ ఔషధంగా పనిచేస్తుందని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఆచార్యులు తమ పరిశోధనలో గుర్తించారు. మామిడిలో ఉండే మాంగిఫెరిన్‌ రసాయనం (బయోయాక్టివ్‌ కాంపొనెంట్‌) అజీర్తిని నివారిస్తుందని ఎలుకలపై చేసిన పరిశోధన ద్వారా శాస్త్రీయంగా నిర్ధారించారు.పూర్తి కథనం

3. పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు

ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ సేవలకే పరిమితమైన పోలీస్‌శాఖ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా తీరు మార్చుకోవడం లేదు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు, బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్నా. అధికార పార్టీ నాయకులు అసాంఘిక చర్యలు, చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నా కేసులు నమోదు చేయకపోవడంతో పోలీస్‌ వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంత అపవాదు మూటకట్టుకుంది.పూర్తి కథనం

4. ప్రభుత్వాన్ని అంగుళం కూడా కదిలించలేరు

‘‘రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా పన్నాగం పన్నుతోంది. అందుకే 400 సీట్లు గెలవాలని చూస్తోంది. దళితుల హక్కులను కాలరాయాలని చూస్తోంది. ఆ పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్లకు పోటు తప్పదు. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. రాహుల్‌ గాంధీని ప్రధాని చేస్తేనే మేలు జరుగుతుంది’’ అని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.పూర్తి కథనం

5. జగన్‌ సమర్పించు క్లాప్‌ దోపిడీ..!

రాష్ట్ర వ్యాప్తంగా క్లాప్‌ వాహనాలను తీసుకొచ్చి వైకాపాకు చెందిన గుత్తేదారుకు దోచిపెట్టేలా మున్సిపల్‌శాఖలోని ఉన్నతాధికారులు వ్యూహం రచించారు. దాన్ని వైకాపా నాయకులు అమలు చేసి రూ.కోట్లలో వాటాలను తీసుకున్నారు. ఆ భారాన్ని చెత్త ఛార్జీల రూపంలో విశాఖ నగర ప్రజలపై మోపారు.పూర్తి కథనం

6. ఎన్నికల తర్వాత ఒక్కొక్క నా కొ.. కథ చెబుతా

ఎన్నికల్లో అడ్డుపడితే.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక్కొక్క నా కొ... కథ చెబుతానంటూ ఉరవకొండ వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి బహిరంగంగా బెదిరింపులకు దిగారు. అనంతపురం జిల్లా ఉరవకొండ తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ సొంత గ్రామ పంచాయతీ కౌకుంట్ల పరిధిలోని మైలారంపల్లి గ్రామంలో ఈ నెల 2న ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పూర్తి కథనం

7. ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్య ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత భారాస ప్రభుత్వం ఆయనకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనాన్ని ప్రకటించింది. 2022లో ‘పద్మశ్రీ’ అవార్డు వచ్చింది. దీంతో అప్పటి సర్కారు మొగిలయ్యకు రూ.కోటి గ్రాంటు, 600 చ.గజాల స్థలం కేటాయించింది.పూర్తి కథనం

8. యువత కలలకు రెక్కలు తొడుగుతాం

ఈసారి ఎన్నికల్లో 40 లక్షల మంది తొలిసారి ఓటేయబోతున్నారు.. ‘యువ’ తీర్పుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డీఎస్సీ ప్రకటనపైనే ఉంటుంది.. యూనిఫైడ్‌ పోర్టల్‌, ఉద్యోగ ప్రకటన తెస్తాం.. ప్యూన్‌ నుంచి గ్రూప్‌-1 వరకు సింగిల్‌ నోటిఫికేషన్‌తో క్యాలెండర్‌ ఇస్తాం..పూర్తి కథనం

9. ‘టానిక్‌’కు మినహాయింపుల్లోనే మతలబు!

రాష్ట్రంలో ఎలైట్‌ వైన్‌షాప్‌ ‘టానిక్‌’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ నిర్ధారణకు వచ్చింది. 2016లో అప్పటి ప్రభుత్వం ‘ఎలైట్‌ రూల్స్‌-2016’ పేరిట తెచ్చిన ప్రత్యేక జీవోతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఏడేళ్లలో సుమారు రూ.133 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదిక రూపొందించింది.పూర్తి కథనం

10. ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌కు సలహా ఇచ్చిన చెస్‌ దిగ్గజం

రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి చెస్‌పై ఉన్న ప్రేమకి సంబంధించి దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్‌ (Garry Kasparov) ఓ సలహా ఇచ్చారు. చెస్‌ (Chess)లో అగ్రస్థానానికి పోటీపడే ముందు మొదట రాయ్‌బరేలీ (Rae Bareli)లో గెలవాలని కాస్పరోవ్‌ పేర్కొన్నారు. ఎక్స్‌(ట్విటర్‌)లో ఓ యూజర్‌ రాహుల్‌ గాంధీని ఉద్దేశించి చేసిన పోస్టుకు కాస్పరోవ్‌ సరదగా స్పందించారు. ఎన్నికల ప్రచారానికి వెళుతూ ఇటీవల రాహుల్‌ గాంధీ తన ఫోన్‌లో చెస్‌ ఆడాడు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని