ఆదివారమే దేశానికి పేరయ్యింది!

డొమినిక.... పర్వతాలతో కూడిన బుల్లి ద్వీప దేశమిది. దీనికి తూర్పున అట్లాంటిక్‌ సముద్రం, పశ్చిమాన కరేబియన్‌ సముద్రం, ఫ్రెంచ్‌ ద్వీపాలైన గ్వాడెలూప్‌ ఉత్తరాన, మార్టినిక్యూ దక్షిణాన ఉంటాయి. ఈ దేశం చాలా చిన్నది. మన హైదరాబాద్‌ కన్నా కాస్త పెద్దగా ఉంటుందంతే......

Published : 25 Jun 2017 01:19 IST

ఆదివారమే దేశానికి పేరయ్యింది!
డొమినిక

* డొమినిక.... పర్వతాలతో కూడిన బుల్లి ద్వీప దేశమిది. దీనికి తూర్పున అట్లాంటిక్‌ సముద్రం, పశ్చిమాన కరేబియన్‌ సముద్రం, ఫ్రెంచ్‌ ద్వీపాలైన గ్వాడెలూప్‌ ఉత్తరాన, మార్టినిక్యూ దక్షిణాన ఉంటాయి.
* ఈ దేశం చాలా చిన్నది. మన హైదరాబాద్‌ కన్నా కాస్త పెద్దగా ఉంటుందంతే.
* క్రిస్టఫర్‌ కొలంబస్‌ ఈ ద్వీప దేశాన్ని 1493లో దర్శించాడు. ఈయన అడుగుపెట్టింది ఆదివారం కావడంతో దీన్ని డొమినిక ద్వీపం అని పిలిచాడు.

‘డొమినిక’ అంటే లాటిన్‌ భాషలో ఆదివారం.

* ఈ దేశంలో పెద్ద నగరం రాజధాని రోసియు. జనాభాలో ఎక్కువ శాతం నివసించేది ఇక్కడే.


* ఈ దేశ జాతీయ పక్షి ‘సిసేరియో ప్యారట్‌’. ఇది ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.


* కాఫీ, పంచదారల ద్వారా ఈ దేశానికి ఎక్కువ ఆదాయం వస్తుంది.

* ఈ దేశంలో మొత్తం 365 నదులు, బోలెడు జలపాతాలు, అందమైన ఇసుక తీరాలు కనిపిస్తాయి.
* ప్రపంచంలో రెండో అతి పెద్ద వేడి నీటి సరస్సు ఉండేది ఇక్కడే. పేరు ‘బాయిలింగ్‌ లేక్‌’.
* రాతి యుగం నాటి ‘ఒరినొకొ’ తెగలు ఇక్కడ మొదటి సారిగా అడుగుపెట్టాయి.


* జెండా: పసుపు రంగు స్థానిక మూల వాసులకు, నలుపు రంగు సారవంతమైన భూములకు, తెలుపు స్వచ్ఛమైన నీటికి గుర్తులు. మధ్యలో ఉన్న నక్షత్రాలు ద్వీపాలకు చిహ్నం.


* దేశం: డొమినిక
* రాజధాని: రోసియు
* జనాభా: 72,660
* విస్తీర్ణం: 750 చదరపు కిలోమీటర్లు
* భాష: ఆంగ్లం
* కరెన్సీ: తూర్పు కరేబియన్‌ డాలర్‌
* అతి ఎత్తయిన పర్వతం ‘మోర్నె డియాబ్లొటిన్‌’. ఇది సుమారు అయిదు వేల అడుగుల ఎత్తు ఉంటుంది.
* ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ.
* చురుకైన అగ్నిపర్వతాల సంఖ్య ప్రపంచం మొత్తంలో ఇక్కడే ఎక్కువ.
* 75 రకాల ఆర్కిడ్లు, 50 రకాల సీతాకోకచిలుకలు, 176 రకాల పక్షులు కనిపిస్తాయిక్కడ.
* సమృద్ధిగా ఉండే వృక్ష జంతుజాలాల వల్ల ఈ దేశాన్ని ‘కరేబియన్‌ సముద్రపు సహజ ద్వీపం’గా పిలుస్తారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని