మంచుగోడల మధ్య రహదారి!

ఎండల్లో చల్లని విహారానికి ఏదైనా మంచు ప్రాంతాలకు వెళితే... కనుచూపు మేర మాత్రమే మంచు కొండలు కనిపిస్తాయేమో- కానీ జపాన్‌లోని ‘తతేయామ కురోబ్‌ ఆల్పిన్‌ రూట్‌’కి వెళ్లామంటే...

Updated : 21 Apr 2024 00:44 IST

ఎండల్లో చల్లని విహారానికి ఏదైనా మంచు ప్రాంతాలకు వెళితే... కనుచూపు మేర మాత్రమే మంచు కొండలు కనిపిస్తాయేమో- కానీ జపాన్‌లోని ‘తతేయామ కురోబ్‌ ఆల్పిన్‌ రూట్‌’కి వెళ్లామంటే... పైన నీలాకాశం తప్ప అంతా హిమమయయే. మొత్తం 37 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో ఇంచుమించు కిలోమీటరు పొడవున ఉండే ‘స్నో కారిడార్‌’ మరీ ప్రత్యేకం. రహదారికి ఇరువైపులా 65 అడుగుల ఎత్తులో పెద్ద పెద్ద మంచుగోడల మధ్య సాగే ఆ ప్రయాణం... గొప్ప సాహసమే. ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రదేశంలో ఏటా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ ‘యుకి నో ఒటానీ’ పేరుతో స్నో కారిడార్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. ఈ సమయంలోనే గడ్డ కట్టే చలిలో మంచుకొండల్ని సందర్శించడానికి దేశవిదేశాల నుంచి ఎందరెందరో బారులు కడుతుంటారు. పర్యటకుల కోసం ప్రత్యేక బస్సులూ, నడకదార్లూ ఉంటాయి. ఆ దేశంలోనే స్నో వరల్డ్‌గా పేరున్న ఈ ప్రాంతాన్ని 1971 నుంచీ పర్యటక ప్రాంతంగా మార్చారు. ఇంకేముంది, మంచు అన్నా సాహసమన్నా ఇష్టపడేవారు ‘మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో’ అంటూ తమతమ భాషల్లో రాగాలు తీసుకుంటూ మంచుదారుల్లో విహరిస్తున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..