Weekly Horoscope: రాశిఫలం (మార్చి 17 - 23)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 03 Apr 2024 14:44 IST


శుభకాలం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. అదృష్టయోగముంది. మానవ ప్రయత్నం చేయాలి. బాధ్యతాయుతంగా కర్తవ్యాలను నిర్వర్తించండి. ధర్మబద్ధంగా వ్యవహరించండి. సాహసోపేతమైన నిర్ణయాలు శక్తినిస్తాయి. భూ సంబంధమైన చర్చలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రులు సహకరిస్తారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.


శుభఫలితాలు సాధించడానికి తగిన కాలం. తీసుకున్న నిర్ణయాలను అమలుచేయండి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి. దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది లభిస్తుంది. ఆలోచనలను కార్యరూపంలోకి తెస్తే అభీష్టం సిద్ధిస్తుంది. బంధుమిత్రుల సహాయసహకారాలు అందుతాయి. వ్యాపారంలో సంతృప్తి ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.  


అదృష్టవంతులవుతారు. శ్రేయోదాయకమైన ఫలితాలుంటాయి. ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. పదోన్నతులు సూచితం. భవిష్యత్తు అవసరాల కోసం చేసే
ప్రయత్నాలు ఒక్కొక్కటిగా సఫలమవుతాయి. మీ మాటకు గౌరవం లభిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఆస్తులు వృద్ధి చెందుతాయి. వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. లక్ష్మీధ్యానం శుభప్రదం.  


ధనయోగముంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దేనికీ తొందరవద్దు. గ్రహబలం తక్కువగా ఉన్నందున సంయమనంతో వ్యవహరించాలి. ఓర్పుతో ఆపదలను అధిగమించాలి. అసూయాపరుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. అంతా మన మంచికే అన్న ధోరణిలో ఉండాలి. పరీక్షా కాలంగా అనిపించినా ధైర్యంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, శుభం జరుగుతుంది. నవగ్రహశ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. మనో బలం, ఏకాగ్రతా అవసరం. సకాలంలో పని చేస్తే విఘ్నాలు తొలగుతాయి. కాలం వ్యతిరేకంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే సమస్యలు ఉండవు. శాంతస్వభావమే కాపాడు తుంది. ఆత్మీయుల సూచనలతో మేలు జరుగు తుంది. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది. నవగ్రహశ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


మనోబలం విజయాన్నిస్తుంది. పనుల్ని వాయిదా వేయవద్దు. శక్తివంచన లేకుండా కృషిచేయండి, కార్యసిద్ధి ఉంటుంది. ధర్మదేవత అనుగ్రహం ముందుకు నడిపిస్తుంది. కాలం మిశ్రమంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు రచించాలి. మొహమాటంతో రుణసమస్యలు పెంచుకోవద్దు. ఇష్టదేవతను స్మరించండి, శుభం కలుగుతుంది.


పలుమార్గాల్లో విజయం లభిస్తుంది. ప్రణాళికలతో లక్ష్యాన్ని సాధించండి. ప్రతి అవకాశాన్నీ అదృష్టంగా మలచుకోవాలి. యోగ్యతలను పెంచుకుంటే బంగారు భవిష్యత్తు సాధించవచ్చు. దేనికీ వెనకడుగు వేయవద్దు. ఉద్యోగంలో పదవీలాభం సూచితం. అర్హతకు మించి ఏ ప్రయత్నం చేయవద్దు. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.


ఆర్థికపరమైన అభివృద్ధి సూచితం. సమయం సహకరిస్తోంది. పెట్టుబడులు కలిసివస్తాయి. గృహ వాహన యోగాలు అనుకూలం. ఉద్యోగంలో ఆటంకాలుంటాయి, ఏకాగ్రతతో పనిచేయండి. చంచల నిర్ణయాలు వద్దు. ఏదీ మనసుకు తీసుకోవద్దు. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపించి నప్పటికీ సత్ప్రవర్తన మీకు శక్తినిస్తుంది. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది. నవగ్రహశ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


శుభకాలం. ఏ పని ప్రారంభించినా విజయం ఉంటుంది. గతంలో ఆగిన పనులు కొన్ని ఇప్పుడు పూర్తిచేసేందుకు వీలవుతుంది. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. అనాలోచితంగా ఏ పనులూ చేయవద్దు. వ్యాపారయోగం అద్భుతంగా ఉంది. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.  


ముఖ్య కార్యాల్లో విజయం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలుచేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మేలైన ఫలితాలుంటాయి. ప్రతిభతో మెప్పిస్తారు. ధనస్థానంలో శుక్రగ్రహం ఆర్థికాభివృద్ధిని ఇస్తుంది. ఆపదనుంచి బయట పడతారు. శనిభగవానుని దర్శించండి, శుభవార్త వింటారు.


లక్ష్మీకటాక్ష సిద్ధి విశేషంగా ఉంది. సంపదలు పెరుగుతాయి. తగిన కృషి చేయాలి. ఒక కల సాకారం అవుతుంది. బ్రహ్మాండమైన వ్యాపారయోగం సూచితం. ఉన్నత స్థితి గోచరిస్తోంది. వ్యాపారంలో అంచెలంచెలుగా విస్తరిస్తారు. తోటివారి సంపూర్ణ సహకారం అందుతుంది. అపార్థాలకు తావు లేకుండా స్పష్టంగా మాట్లాడాలి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది. నవగ్రహశ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ముఖ్యకార్యాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. సకాలంలో పనులు పూర్తిచేయాలి. ఓర్పు మిమ్మల్ని రక్షిస్తుంది. విఘ్నాలు ఎదురైనా పట్టుదలతో పనిచేయాలి. నిరుత్సాహాన్ని కలిగించే ఆలోచనలు రానివ్వద్దు. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. మొహమాటంతో ఆర్థిక సమస్యలు వస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదివితే ఆపద నుంచి బయటపడతారు. నవగ్రహశ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..