కార్ల కోసం అయస్కాంత పరదాలు!

ఏసీ చల్లదనం ఎంతలా ఉన్నా ఎండల్లో కారు అద్దాల్లోంచి వేడి తగులుతూనే ఉంటుంది. దాన్నుంచి రక్షించుకోవడానికి చాలావరకూ సన్‌షేడ్స్‌లాంటివి పెట్టుకుంటుంటారు.

Published : 14 Apr 2024 01:16 IST

సీ చల్లదనం ఎంతలా ఉన్నా ఎండల్లో కారు అద్దాల్లోంచి వేడి తగులుతూనే ఉంటుంది. దాన్నుంచి రక్షించుకోవడానికి చాలావరకూ సన్‌షేడ్స్‌లాంటివి పెట్టుకుంటుంటారు. కానీ వాటికన్నా ఎక్కువ సౌకర్యాన్ని ఇస్తాయీ ‘మ్యాగ్నటిక్‌ కార్‌ కర్టెన్స్‌’. ఈ నైలాన్‌ క్లాత్‌ పరదాల పైన అయస్కాంతపు కడ్డీ ఉంటుంది. దీనివల్ల కారు కిటికీకి నచ్చినట్టు అమర్చుకోవచ్చు. అంతేకాదు, కావాల్సినప్పుడు పెట్టుకుని మళ్లీ సులువుగా తీసుకోవచ్చు కూడా. ఇంకా అవసరమైనంత వరకే పరదాను తెరుచుకోవచ్చు. ఎండల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు చల్లదనాన్ని ఇస్తూ ఈ పరదాలు కచ్చితంగా ఉపయోగపడతాయి. నచ్చితే ఓసారి ట్రై చేసి చూడండి మరి!Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..