వ్యాయామం చేసేటప్పుడు ‘క్రీమ్‌’ వద్దు!

కొందరు ముఖానికి ఏదో ఒక క్రీములేనిదే బయటకు రారు. ఈ అలవాటున్నవాళ్ళు క్రీము రాసుకుని వ్యాయామాలు చేయకూడదని చెబుతున్నారు పరిశోధకులు. మామూలుగా వ్యాయామం చేసేటప్పుడు చర్మగ్రంథులు వ్యాకోచించి సీబమ్‌ ద్రవాలని స్రవిస్తాయి.

Published : 23 Mar 2024 23:58 IST

కొందరు ముఖానికి ఏదో ఒక క్రీములేనిదే బయటకు రారు. ఈ అలవాటున్నవాళ్ళు క్రీము రాసుకుని వ్యాయామాలు చేయకూడదని చెబుతున్నారు పరిశోధకులు. మామూలుగా వ్యాయామం చేసేటప్పుడు చర్మగ్రంథులు వ్యాకోచించి సీబమ్‌ ద్రవాలని స్రవిస్తాయి. అది చర్మ ఆరోగ్యానికి మంచిది కూడా. కానీ ముఖంపైన ఫౌండేషన్‌ క్రీమ్‌లాంటిది ఉంటే ఆ గ్రంథుల్ని కప్పేస్తుంది. దాంతో సీబమ్‌ ద్రవం లోపలే ఉండిపోయి చర్మ సమస్యలకి దారితీస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. అమెరికాలోని టెక్సాస్‌ ఏ అండ్‌ ఎమ్‌ పరిశోధకులు తమ క్యాంపస్‌లోని 50 మంది యువతీయువకులపైన దీన్ని ప్రయోగాత్మకంగానే నిరూపించి చూపారు. వాళ్ళ నుదురు, గడ్డంపైన సన్నగా ‘ఫౌండేషన్‌’ వేయించి- అర్ధగంటపాటు ట్రెడ్‌మిల్‌పైన పరుగెత్తించారు. వ్యాయామం అయ్యాక చర్మాన్ని పరీక్షిస్తే- మేకప్‌ వేసిన చోట సీబమ్‌ ద్రవాలే లేవని తేల్చారు. అది క్రీమ్‌ని దాటుకుని రాలేక లోపలే ఉండిపోవడం చర్మ సమస్యలకి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖానికి  క్రీమ్‌వాడి వ్యాయామాలకి వెళ్ళొద్దంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..