‘ఏఆర్‌’ పెయింట్‌తో బస్సులు!

చాలా నగరాల్లో బస్సులపైన ప్రకటనల పెయింట్స్‌ వేయడం చూసుంటాం. అయితే... దానికే చెన్నైలో ఓ కొత్త హంగుని అద్దింది ఏషియన్‌ పెయింట్స్‌ సంస్థ.

Published : 18 Feb 2024 00:09 IST

చాలా నగరాల్లో బస్సులపైన ప్రకటనల పెయింట్స్‌ వేయడం చూసుంటాం. అయితే... దానికే చెన్నైలో ఓ కొత్త హంగుని అద్దింది ఏషియన్‌ పెయింట్స్‌ సంస్థ. తమిళనాడు సంస్కృతి వైభవాన్ని చాటేట్టూ అక్కడి ఆలయ గోపురాలూ, భరతనాట్యం వంటి కళల్ని ప్రతిబింబించేట్టూ బస్సుల్ని తీర్చిదిద్దుతోంది. కేవలం బయటే కాదు- బస్సులోపలా ఆ రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన అత్తంగుడి టైల్స్‌తో చక్కగా అలంకరిస్తోంది. బస్సు ఎక్కబోయే ప్రయాణికులు ఎవరైనా తమ ఫోన్‌ కెమెరాని ఇక్కడి చిత్రాల్లోని కొన్ని భాగాలపైన చూపితే చాలు- ఒకటిన్నర నిమిషం పాటు ఉర్రూతలూగించే పాట ఒకటి కనిపిస్తుంది. అన్నట్టు, ఆ మధ్య కోల్‌కతాలోని ట్రామ్‌ సర్వీసులకి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా కూడా ఓ ట్రామ్‌బండిని ఇలాగే కళాత్మకంగా తీర్చిదిద్దింది ఏషియన్‌ పెయింట్‌ సంస్థ. కాకపోతే- అక్కడ ఒక్క ‘ట్రామ్‌’కే పరిమితమైతే చెన్నైలో 22 బస్సుల్ని అచ్చం ఓ కళాఖండంలాగే మార్చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..