చూపు... మళ్ళీ తెప్పిస్తున్నారు!

గ్లకోమా... చూపు కోల్పోయే ఈ పరిస్థితికి మధుమేహం కూడా ఒక కారణం. మన కళ్ళ వెనకాల- రెటీనాలో అతిసున్నితమైన దృశ్యనాడులు (ఆప్టికల్‌ నెర్వ్స్‌) ఉంటాయి. వీటిల్లోని ‘రెటినల్‌ గాంగ్లియన్‌’ అనే ప్రత్యేక కణాలే మనం చూసే దృశ్యాలని మెదడుకి చేరవేస్తాయి. 

Published : 03 Mar 2024 00:05 IST

గ్లకోమా... చూపు కోల్పోయే ఈ పరిస్థితికి మధుమేహం కూడా ఒక కారణం. మన కళ్ళ వెనకాల- రెటీనాలో అతిసున్నితమైన దృశ్యనాడులు (ఆప్టికల్‌ నెర్వ్స్‌) ఉంటాయి. వీటిల్లోని ‘రెటినల్‌ గాంగ్లియన్‌’ అనే ప్రత్యేక కణాలే మనం చూసే దృశ్యాలని మెదడుకి చేరవేస్తాయి. మధుమేహం కారణంగా రక్తంలో నిండిపోయిన చక్కెర్లు- ఈ కణాలని చంపేస్తాయి. దాంతో చూపు పోతుంది. దెబ్బతిన్న ఆ ‘రెటినల్‌ గాంగ్లియన్‌’ కణాల స్థానంలో కొత్తవాటిని సృష్టించగలిగితే అంధులకి మళ్ళీ చూపు తెప్పించవచ్చు. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు సాగుతున్నా... దానికి సంబంధించి ఇటీవల ఓ కీలకమైన ముందడుగు పడింది. అమెరికాలో కాలిఫోర్నియాలోని ‘చిల్డ్రన్‌ హాస్పిటల్‌ లాస్‌ ఏంజిలస్‌’కి చెందిన- భారతీయ మూలాలున్న పరిశోధకుడు బిరాజ్‌ మహతో దీన్ని సాధించాడు. ఇందుకోసం ఎనిమిది రసాయనాలతో కూడిన ప్రత్యేక ద్రవ మిశ్రమాన్ని రూపొందించాడు. ఆ మిశ్రమంలో- కంట్లో ఉండే ‘మ్యూలర్‌ గ్లియా’ అనే మామూలు కణాలని ఉంచాడు. రెండువారాల తర్వాత- ఆ మామూలు కణాలే ప్రత్యేక ‘రెటినల్‌ గాంగ్లియన్‌’ కణాలుగా ఎదిగాయట! ఇలా పెరిగిన కణాలని- దృశ్యనాడులు దెబ్బతిన్న ఎలుకల కళ్ళలో ఉంచి పరీక్షిస్తే 45 రోజుల్లో వాటికి చూపు తిరిగొచ్చిందట. ఇక, ఈ పరీక్ష మానవుల్లోనూ విజయం సాధిస్తే- గ్లకోమా కారక అంధత్వాన్ని పూర్తిగా అరికట్టవచ్చని చెబుతున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..