ఇది విన్నారా!

మనం తుమ్మితే ఏ బామ్మో తాతయ్యో ‘చిరంజీవ’ అంటారు. మన దగ్గర ఇప్పుడు ఆ అలవాటు తగ్గి పోయినా పాశ్చాత్య దేశాల్లో ఇంకా ఉంది.

Published : 31 Mar 2024 00:30 IST

‘హాచ్‌’ అంటే..!

మనం తుమ్మితే ఏ బామ్మో తాతయ్యో ‘చిరంజీవ’ అంటారు. మన దగ్గర ఇప్పుడు ఆ అలవాటు తగ్గి పోయినా పాశ్చాత్య దేశాల్లో ఇంకా ఉంది. బామ్మో తాతయ్యో కాదు- మనం తుమ్మితే పక్కన ఎవరున్నా సరే ‘బ్లెస్‌ యూ’ అంటారు అక్కడ! దాని వెనక పెద్ద చరిత్రే ఉంది. క్రీస్తు శకం 540లో ఐరోపాలో ప్లేగు వ్యాధి వ్యాపించిందట. దాని ప్రారంభ లక్షణాల్లో ఒకటి- తుమ్ము. తుమ్మిన వ్యక్తి అంతటి ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కోబోతున్నాడు కాబట్టి- వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు ‘గాడ్‌ బ్లెస్‌ యూ’ అనాలని నాటి పోప్‌ గ్రెగరీ ఆదేశించాడట. అప్పటి నుంచీ ఆ అలవాటు కొనసాగుతోంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..