Ugadi Rasi Phalalu 2024: క్రోధి నామ సంవత్సరంలో రాశి ఫలం

క్రోధి నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 10 Apr 2024 14:38 IST

ఆదాయం 8; వ్యయం 14 రాజపూజ్యం 4; అవమానం 3

ఈ రాశివారికి అదృష్టయోగం 75శాతం బాగుంది. పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ధనస్థానంలో గురుగ్రహం వల్ల సౌఖ్యం, కీర్తి, ధనలాభం, ధర్మకార్యాచరణ ఉంటాయి. మే వరకూ గురుబలం తక్కువగా ఉన్నా తర్వాత చాలా బాగుంటుంది. ధనలాభం శుభప్రదంగా ఉంటుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. విద్యాయోగం శుభప్రదం. ఏకాదశంలో శని విశేషమైన లాభాన్ని ప్రసాదిస్తాడు. ఉద్యోగంలో మంచి ఆలోచనావిధానంతో పనిచేయండి, తప్పక కలిసివస్తుంది. వృత్తిలో రాణిస్తారు. పంటలు బాగా పండుతాయి. విదేశీ యోగం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. భూ గృహ వాహన యోగాలు కలిసివస్తాయి. అవివాహితులకు ఉత్తరార్ధంలో కల్యాణ ఘడియలు బలంగా ఉన్నాయి. సంతానయోగముంది. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. ఆనందంగా ఉంటారు. కుటుంబసభ్యులకు మేలు కలుగుతుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. అనారోగ్య సమస్యలు తక్కువ. మీమీ రంగాల్లో విశేష కృషి చేసినట్లయితే త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. ధర్మం రక్షిస్తుంది. ఆనందం, సంతృప్తి, మనశ్శాంతి సంపూర్ణంగా లభిస్తాయి. మార్చి 29నుంచి మేషరాశివారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. వీరికి శనిధ్యానం మేలుచేస్తుంది. మరిన్ని శుభఫలితాలకై పూర్వార్థంలో గురుశ్లోకం, సంవత్సరమంతా రాహుగ్రహ శ్లోకం చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఆదాయం 2; వ్యయం 8; రాజపూజ్యం 7; అవమానం 3

అదృష్టయోగం 25శాతమే ఉంది. ఏకాదశంలో రాహుగ్రహం వల్ల రాజగౌరవం, ప్రభుసన్మానం, పశులాభం, భోజనసౌఖ్యం, వస్త్ర, వస్తుప్రాప్తి మొదలగు శుభఫలితాలు ఉంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. విద్యావిషయంలో గురుబలం అనుకూలంగా లేదు. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిలో కష్టపడాల్సి ఉంటుంది. గ్రహదోషం అధికంగా ఉంది. వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశయోగం అనుకూలం. ప్రయాణాల్లో శ్రద్ధ వహించండి. భూ, గృహ, వాహన యోగాలు బాగున్నాయి. అవివాహితులకు కల్యాణ ఘడియలు ఆలస్యమవుతాయి. సమష్టి నిర్ణయాలు తీసుకుంటూ శుభఫలితాలకై గురు, శని, కేతు శ్లోకాలు చదువుకోవాలి.  నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 6

మిథునరాశి వారికి 50శాతం అదృష్టయోగముంది. పూర్వార్థంలో గురువు వల్ల కీర్తివృద్ధి, సర్వత్రా విజయం, శత్రువులు మిత్రులవడం జరుగుతుంది. రాహువు దశమ రాజ్యకేంద్రంలో సంతోషం, భోజన సౌఖ్యం, కర్మసిద్ధి, శరీరబలం, మొదలైన శుభఫలితాలను ప్రసాదిస్తున్నాడు. మే తర్వాత గురుబలం తగ్గుతుంది. విద్యాయోగం శుభప్రదం. ఉద్యోగంలో పదవీలాభముంది. వ్యాపారంలో ధనలాభం సూచితం. వృత్తి నైపుణ్యంతో ఉన్నతస్థితిని సాధిస్తారు. వ్యవసాయం కలిసివస్తుంది. విదేశ ప్రయత్నాలు సఫలమవుతాయి. ధనలాభం మే వరకూ అద్భుతంగా ఉంటుంది. వివాహఘడియలు మే వరకూ సానుకూలం. కష్టాలు తొలగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. లక్ష్యం నెరవేరుతుంది. మరిన్ని శుభఫలితాలకై శని, కేతు శ్లోకాలు చదవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 6; అవమానం 6

అదృష్టయోగం 50శాతముంది. ఏకాదశంలో గురుగ్రహం వల్ల కీర్తివృద్ధి, శత్రువులపై విజయం సిద్ధిస్తాయి. మూడోరాశిలో కేతువు వల్ల సౌభాగ్యం, ధనలాభం, ఆరోగ్యం వంటి శుభాలున్నాయి. విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యాయోగముంది. ఉద్యోగరీత్యా పూర్వార్థం బాగుంటుంది. వ్యాపారంలో రాణిస్తారు. మే నుండి విశేష లాభాలుంటాయి. వ్యవసాయంలో విజయాలుంటాయి. విదేశీ యానానికి అవకాశమొస్తే సద్వినియోగం చేసుకోవాలి. తీర్థయాత్రలు చేస్తారు. భూ, గృహ, వాహనయోగాలు శుభఫలితాన్నిస్తాయి. మంచి జీవితభాగస్వామి లభిస్తారు. సంతాన సౌఖ్యముంది. ఆనందం, సంతృప్తి, మనశ్శాంతి కర్కాటక రాశివారికి పుష్కలంగా ఉంటాయి. మరిన్ని శుభఫలితాలకై గురు, శని, రాహు గ్రహ శ్లోకాలు చదువుకోవాలి.నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఆదాయం 2; వ్యయం 14; రాజపూజ్యం 2; అవమానం 2

ఈ రాశివారికి అదృష్టయోగం 25శాతమే. భాగ్య బృహస్పతియోగం వల్ల మే వరకు ధనలాభం, మంచి భోజనం, సుఖం లభిస్తాయి. శని, రాహు, కేతు గ్రహాలు సహకరించడం లేదు కాబట్టి వారిని ధ్యానించాలి. విద్యార్థులకు మే వరకూ మంచి ఫలితాలున్నాయి. వ్యాపారయోగం కూడా మే వరకూ బాగుంది. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తిలో జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు తొలగుతాయి. వ్యవసాయంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మే తర్వాత విదేశ ప్రయాణాలు చేసేవారు సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవాలి. భూ, గృహ వాహనాల విషయంలో ప్రయత్నం బాగా చేయాలి. అవివాహితులకు మే వరకూ అనుకూలం. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. మనోధైర్యంతో కష్టాలను అధిగమిస్తూ ముందుకెళ్లాలి.


ఆదాయం 5 వ్యయం 5 రాజపూజ్యం 5 అవమానం 2

కన్యారాశి వారికి గురు, శని గ్రహాల వల్ల యాభైశాతం శ్రేష్ఠమైన ఫలితాలున్నాయి. మే నుండి బృహస్పతి అనుగ్రహం వల్ల విశేష ధనలాభం, గృహలాభం, మంచి భోజనం తదితర ఫలితాలుంటాయి. ఆరవ రాశిలో శని స్వక్షేత్రంలో ఉండటంతో అదృష్టవంతులవుతారు. ఉన్నతవిద్యల్లో రాణిస్తారు. ఉద్యోగంలో పదవీయోగం సూచితం. స్థిరత్వం ఏర్పడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో అధిక ధనలాభాలు ఉంటాయి. ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరుస్తారు. వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు సఫలమవుతాయి. పంటలు బాగా పండుతాయి. విదేశీయాన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మే వరకూ సామాన్యంగా ఉన్నా ఆ తర్వాత అద్భుతమైన లాభాలుంటాయి. పెట్టుబడులు కలిసివస్తాయి. కార్యసిద్ధి ఉంది. మే తర్వాత వివాహయోగం శుభప్రదం. సంతానం గురించి శుభవార్త వింటారు. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. సుఖాలే అధికంగా ఉంటాయి. ఆనందాన్నీ, మనశ్శాంతినీ, సంకల్పసిద్ధినీ పొందుతారు. మరిన్ని శుభఫలితాలకై రాహుకేతువులను ధ్యానించాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఆదాయం 2; వ్యయం 8; రాజపూజ్యం 1; అవమానం 5

ఈ రాశివారికి అదృష్టయోగం యాభైశాతముంది. గురు, రాహువులు యోగిస్తున్నారు. మే వరకూ సప్తమంలో మేష గురువు రాజదర్శనం, ఆరోగ్యం, ఇష్టకార్యసిద్ధి వంటి శుభఫలితాలను ప్రసాదిస్తాడు. షష్ఠ స్థానంలో మీన రాహువు ధైర్యాన్నీ శత్రువులపై విజయాన్నీ భూలాభాన్నీ కలుగజేస్తాడు. పూర్వార్థంలో బ్రహ్మాండమైన విద్యాయోగం ఉంది. ఉద్యోగంలో అధికార లాభం సూచితం. వ్యాపారంలో అధిక ధనలాభముంది. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతారు. వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలున్నాయి. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. భూ గృహ వాహన యోగాలు కలిసివస్తాయి. ఈ ఏడాది వివాహయోగం శుభప్రదంగా ఉంది. సంతానవృద్ధి కలుగుతుంది. మరిన్ని శుభఫలితాలకై గురు, శని, కేతువులను ధ్యానించాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


 
ఆదాయం 8; వ్యయం 14; రాజపూజ్యం 4; అవమానం 5

ఈ రాశి వారికి యాభైశాతం అదృష్టయోగముంది. ఉత్తరార్థంలో వృషభ బృహస్పతి రాజదర్శనం, ఆరోగ్యం, ఇష్టకార్యసిద్ధినిస్తాడు. ఏకాదశంలో కన్యా కేతువు పశులాభాన్నీ భోజనసౌఖ్యాన్నీ వస్త్ర, వస్తు ప్రాప్తినీ కలిగిస్తాడు. మంచి విద్యాయోగం ఉంది. మనోభీష్టం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో అధికార లాభముంది. వ్యాపారం కలిసివస్తుంది. వృత్తిలోనూ కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యవసాయంలో ఆశించిన లాభాలొస్తాయి. విదేశ యత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రదర్శనం శక్తినిస్తుంది. మే తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. భూ, గృహ, వాహన యోగాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఉత్తరార్థంలో కల్యాణఘడియలు బాగున్నాయి. సంతానభాగ్యముంది. కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు. గురు, శని, రాహువులను ధ్యానిస్తే సత్ఫలితాలుంటాయి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండిఆదాయం 14; వ్యయం 14; రాజపూజ్యం 3; అవమానం 1

గురు, కేతు గ్రహాల వల్ల అదృష్టయోగం 50శాతం అనుకూలం. ఉత్తరార్థంలో గురువు- ఐశ్వర్యం, కర్మసిద్ధి, కుటుంబసౌఖ్యం కలుగజేస్తాడు. తృతీయస్థానంలో రాహువు సౌభాగ్యం, ఆరోగ్యం, కీర్తి తదితర ఫలితాలను ఇస్తాడు. చక్కని విద్యాయోగం సూచితం. ఉద్యోగంలో పదోన్నతులు సిద్ధిస్తాయి. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశదిశలా వ్యాప్తిచెందుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. బుద్ధిబలంతో మెప్పిస్తారు. స్థిరమైన వృత్తి లభిస్తుంది. వ్యవసాయపరంగా కలిసివస్తుంది. ఆశించిన లాభాలొస్తాయి. విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్మీకటాక్ష సిద్ధి ఉంది. ఉత్తరార్థంలో అభివృద్ధిని సాధిస్తారు. అవివాహితులకు మే తర్వాత ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కొందరికి ఆదర్శనీయులు అవుతారు. కష్టాలు తొలగుతాయి. కాలానుగుణమైన నిర్ణయాలతో ముందుకెళ్లండి. సంతృప్తి, మనశ్శాంతి, సంకల్పసిద్ధి బ్రహ్మాండంగా ఉన్నాయి. శని, కేతు, గురు శ్లోకాలు చదువుకుంటే మంచిది. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండిఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 7; అవమానం 5

ఈ రాశివారికి 75శాతం అదృష్టయోగం ఉంది. పూర్వార్థంలో పంచమ బృహస్పతి మేషంలో- ఐశ్వర్యం, కర్మసిద్ధి, కుటుంబసౌఖ్యం తదితర ఫలితాలనిస్తున్నాడు. దశమంలో కేతువు- సర్వసుఖాలనూ ప్రసాదిస్తున్నాడు. బృహస్పతి అనుగ్రహం వల్ల విద్యార్థులకు మే వరకూ అద్భుతమైన విద్యాయోగం ఉంది. గురు శ్లోకం చదువుకుంటే ఉత్తరార్థంలో కూడా శుభఫలితాలుంటాయి. ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారయోగం సూచితం. వ్యాపారంలో మే వరకూ బ్రహ్మాండమైన లాభాలున్నాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. వృత్తిలో త్వరగా అభివృద్ధిని సాధిస్తారు. నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది. నూతనత్వంతో కూడిన ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయంలో  మంచి పంట చేతికి అందుతుంది. విదేశయోగం అద్భుతంగా ఉంది. మే వరకూ విశేష ఆర్థిక యోగాలున్నాయి. తర్వాత రుణసమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. భూ, గృహ, వాహన యోగాలు అనుకూలిస్తాయి. వివాహయత్నాల్లో ఉన్నవారికి మే లోపల మంచి భాగస్వామి దొరుకుతారు. సంతానం అభివృద్ధిని సాధిస్తారు. సమస్యలు తొలగుతాయి. ధర్మదేవత అనుగ్రహం వల్ల సంతృప్తికరమైన జీవితం, మనశ్శాంతి లభిస్తాయి. మరిన్ని శుభఫలితాలకై రాహు, గురు శ్లోకాలు చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండిఆదాయం 14; వ్యయం 14; రాజపూజ్యం 6; అవమానం 1

కుంభరాశి వారికి ఈ ఏడాది గురు, శని, రాహు, కేతు గ్రహాలు వ్యతిరేక ఫలితాలనిస్తున్నాయి. ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. లోతుగా ఆలోచించి సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి. ఉద్యోగంలో సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తొలగుతాయి. వ్యవసాయంలో పరిస్థితులు అనుకూలంగా లేవు. గ్రహదోష నివారణార్థమై ఇష్టదేవతాసందర్శనం మంచిది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. సంతానంతో ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతంగా వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధర్మబద్ధంగా వ్యవహరించండి. మార్చి 29 నుండి కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఏలినాటిశని ఉంటుంది. మరిన్ని సత్ఫలితాలకై గురు, శని, రాహు, కేతు గ్రహాల ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మంచిది. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండిఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 2; అవమానం 4

మీనరాశి వారికి ధనస్థానంలో బృహస్పతి పూర్వార్థంలో సదా రక్షిస్తున్నాడు. సుఖం, సౌభాగ్యం, కీర్తి తదితర శుభఫలితాలనిస్తున్నాడు. వాక్శుద్ధి వీరిని కాపాడుతుంది. విద్యాయోగం మే వరకూ అనుకూలం. ఉన్నతవిద్యల్లో బాగా కష్టపడాలి. ఉద్యోగం సానుకూలం. వ్యాపారయోగం మిశ్రమంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. గ్రహదోష నివారణకై తీర్థయాత్రలు చేస్తే మంచిది. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. భూ, గృహ, వాహన యోగాలు మిశ్రమంగా ఉన్నాయి. అవివాహితులకు మే వరకూ కల్యాణ ఘడియలు బలంగా ఉన్నాయి. సంతానయోగం శుభప్రదం. మార్చి 29 నుంచి మీనరాశి వారికి జన్మరాశిలో ఏలినాటి శని ఉంది. అందుకని శనిధ్యానం చేయాలి. రాహు, కేతు, గురు శ్లోకాలూ చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండిTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..