Weekly Horoscope: రాశిఫలం (మే 5 - మే 11)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 05 May 2024 00:21 IST

 


గతవారం కంటే శుభప్రదం. అదృష్టం వెంటాడుతుంది. ఆశయాలు నెరవేరుతాయి. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. గృహనిర్మాణం సంకల్పిస్తారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మీయులతో కలిసి స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు వద్దు. ఇష్టదైవాన్ని స్మరించండి.


మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారవృద్ధి ఉంది. లాభాలు అందుకుంటారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. గిట్టనివారి మాటలను మనసులోకి తీసుకోవద్దు. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఇష్టదేవతను స్మరించండి.


ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. అధికార యోగం సూచితం. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఎంతో బలపడతారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు గొప్ప విజయాన్ని ప్రసాదిస్తాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగేయాలి. ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. న్యాయ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి.


ఉద్యోగలాభం ఉంది. పదోన్నతులు సూచితం. కీర్తి లభిస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. సుస్థిరత దిశగా అడుగులు వేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనాలోచిత నిర్ణయాలు వద్దు. కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు. వారం మధ్యలో అదృష్టం వరిస్తుంది. గురుబలం కీలక స్థానానికి తీసుకెళ్తుంది. ఇష్టదేవతను స్మరించండి.


ధనయోగం సూచితం. విజయాలు సాధిస్తారు. ఆలోచించి అడుగువేయాలి. గ్రహ దోషం అధికం. విజయసాధనలో ప్రశాంతత ముఖ్యం. ముఖ్య విషయాల్లో కుటుంబాన్ని భాగం చేయండి. లక్ష్య సాధనలో ఆరంభ శూరత్వం వద్దు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక సాధన పెరుగుతుంది.  నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి.


అదృష్టయోగం సూచితం. మనోబలంతో విజయం సాధిస్తారు. పరిష్కారం కాని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. సంకల్ప సిద్ధి ఉంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆత్మీయుల అవరోధాలు తొలగుతాయి. పొదుపు-మదుపు గురించి ఆలోచించాలి.  ఇష్టదేవతను ఆరాధించాలి.


ఏకాగ్రత పెంచుకోవాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. పనుల వాయిదా మంచిది కాదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త కార్యక్రమాలు అమలు చేయాలి. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలం పెరుగుతుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ప్రణాళికలతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఇష్టదేవతను స్మరించాలి.


దైవానుగ్రహం ఉంది. అదృష్టం సూచితం. ఆగిపోయిన పనులు వేగాన్ని అందుకుంటాయి. ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగులకు పదవీలాభం ఉంది. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతాయుత ప్రవర్తనతో శుభ ఫలితాలు సాధిస్తారు. సంయమనం ముఖ్యం. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. నిర్ణయాలను సమీక్షించుకోవాలి. ఇష్టదేవతను స్మరించండి.


వ్యాపార లాభాలు ఉన్నాయి. ఆర్థిక ప్రగతి సూచితం. ఆత్మీయుల ప్రోత్సాహం లభిస్తుంది. నిర్ణయాల అమలులో చిత్తశుద్ధి అవసరం. ఇబ్బందులు సృష్టించేవారితో జాగ్రత్త.
ఆర్థిక మోసాలు చుట్టుముడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వారం చివరి భాగంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఇష్టదేవతను స్మరించండి.


గౌరవప్రదమైన జీవనం గడుపుతారు. ఆదరాభిమానాలు పొందుతారు. కీర్తి ఇనుమడిస్తుంది. శత్రు దోషం తొలగుతుంది. అధికారుల సహకారం లభిస్తుంది. ధనయోగం సూచితం. స్థిరచరాస్తుల గురించి ఆలోచిస్తారు. గృహ నిర్మాణం దిశగా అడుగులు వేస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇష్టదేవతను స్మరించండి.


ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయత్నాల్లో పురోగతి ఉంది. అధికారుల ప్రశంసలు అందు కుంటారు. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. అనుభవ సంపన్నుల అండ లభిస్తుంది. అంకితభావంతో కొత్త నైపుణ్యాన్ని పెంచుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. గృహ, వాహన యోగాలున్నాయి. ఇష్టదేవతను స్మరించండి.


మనోబలాన్ని మించిన విజయరహస్యం లేదు. వెనుకడుగు వేయవద్దు. నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం. ధర్మమార్గంలో ముందుకు సాగండి. ఆర్థికంగా బలపడతారు. ధనయోగం ఉంది. పెట్టుబడులు సత్ఫలితాలను ఇస్తాయి. ఆచితూచి అడుగేయాలి. ఎందుకంటే గ్రహదోషం గోచరిస్తోంది. కలసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇష్టదేవతను స్మరించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు