Weekly Horoscope: రాశిఫలం (మే 12 - మే 18)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 17 May 2024 13:13 IST


శుభయోగాలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక వృద్ధి సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు చేస్తారు. మీ ఆలోచనలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఉద్యోగులు లక్ష్యాలను సాధిస్తారు. కొన్ని విషయాల్లో వెనుకడుగు వేస్తారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అపార్థాలకు ఆస్కారం ఉంది. లక్ష్మీదేవిని ధ్యానించండి.


ఉత్సాహంగా కొత్తకార్యాలు ప్రారంభిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయకండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఏడు గ్రహాలూ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కాబట్టి, ముందూవెనుకా ఆలోచించి పనులు ప్రారంభించండి. ఏకాగ్రత అవసరం. సాంకేతిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి.


గ్రహబలం అనుకూలం. పదోన్నతి వరిస్తుంది. కీర్తి పెరుగుతుంది. జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది. ధనలాభం సూచితం. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తుపై ఆలోచనకు సరైన సమయం. రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాల్లో లాభం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవాన్ని స్మరించాలి.


అదృష్ట యోగం ఉంది. విజయాలు వరిస్తాయి. గురుగ్రహం ప్రభావంతో పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. సమాజంలో పేరు సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం ఉంది. జీవిత లక్ష్యం దిశగా అడుగులు పడతాయి. అనుకోని ఖర్చులు ఉన్నాయి. ఇష్ట దైవాన్ని పూజించండి.


మనోబలంతో ముందడుగు వేస్తారు. విజయం వరిస్తుంది. కీలక నిర్ణయాల్లో వెనుకడుగు వేయకండి. సకల సంపదలు వృద్ధి చెందుతాయి. అవరోధాలకు నిరుత్సాహం వద్దు. మిత్రుల సూచనలు మంచి చేస్తాయి. ఆత్మీయులతో విభేదాలు రావచ్చు. వారాంతంలో అన్నివిధాలా మంచి జరుగుతుంది. నవగ్రహాలను స్మరించండి.


ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. అష్టమంలో శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనల్లో స్పష్టత అవసరం. సూర్య భగవానుడి ధ్యానం మేలు చేస్తుంది.


ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. మనో బలాన్ని దూరం చేసుకోకండి. కుజుడి ప్రభావంతో మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. గ్రహ దోషం వల్ల పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది. ఆలోచించి అడుగు ముందుకు వేయండి. అపోహలకు ఆస్కారం ఇవ్వకండి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి.


శుభయోగం నడుస్తోంది. అంతా మంచే జరుగు తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. దైవబలం రక్షిస్తుంది. ఇష్టకార్యం సిద్ధిస్తుంది. బుధుడి అనుగ్రహం వల్ల ఆర్థిక ప్రయోజనం పొందుతారు. మనోధైర్యం మరిన్ని విజయాలను అందిస్తుంది. ప్రశంసలు లభిస్తాయి. మీవల్ల నలుగురికీ¨ మేలు జరుగు తుంది. ధర్మమార్గంలో విజయాలు సాధిస్తారు. చంద్రుడిని ధ్యానించాలి.


అనుకున్న పనులు నెరవేరుతాయి. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. సమయానికి డబ్బు అందుతుంది. శుక్రుడి వల్ల సంపదలు పెరుగుతాయి. వ్యాపారంలో అజాగ్రత్త వద్దు. ఉద్యోగ బాధ్యతల విషయంలో మరింత శ్రద్ధగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన జీవితం గడుపుతారు. రవి ధ్యానం శుభప్రదం.  


గ్రహబలం పెరిగింది. శుభకాలం మొదలైంది. ఆశయాలు సిద్ధిస్తాయి. వ్యాపార విజయాలు సాధిస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం ముఖ్యం. స్వస్థాన ప్రాప్తి ఉంది. భూ, గృహ లాభాలున్నాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. సామాజిక సేవలో పాల్గొంటారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.


ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తారు. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఇతరుల ప్రవర్తనను పట్టించుకోవద్దు. శుక్రుడి అనుగ్రహంతో వాణిజ్య పరమైన లాభాలు ఉన్నాయి. ఆటంకాలు ఎదురైనా సులభంగా అధిగమిస్తారు. ముందస్తు ప్రణాళికతో అడుగు ముందు కేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి.


వ్యాపారయోగం శుభప్రదం. ధనలాభం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ అధిక మైనా ఫలితాలు ఉంటాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. చక్కని ప్రణాళికతో ఒత్తిడిని అధిగమిస్తారు. శుక్రగ్రహ యోగంతో ధనలాభం సూచితం. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయండి. నవగ్రహ ధ్యానం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు