మెడ చుట్టే మెరుపుల్‌

చలికాలం తరుముకొస్తోంది. దాన్ని కాచుకునేలా, మరోవైపు స్టైలిష్‌గా కనిపించాలంటే కుర్రకారుకి ‘టర్టిల్‌ నెక్‌’ స్వెటర్లు, చొక్కాలు మంచి ఎంపిక. తాబేలు మెడలాంటి డిజైన్‌తో మెడను పూర్తిగా కప్పేయడంతో ఆ పేరొచ్చింది. తారలు...

Updated : 18 Sep 2021 04:48 IST

లికాలం తరుముకొస్తోంది. దాన్ని కాచుకునేలా, మరోవైపు స్టైలిష్‌గా కనిపించాలంటే కుర్రకారుకి ‘టర్టిల్‌ నెక్‌’ స్వెటర్లు, చొక్కాలు మంచి ఎంపిక. తాబేలు మెడలాంటి డిజైన్‌తో మెడను పూర్తిగా కప్పేయడంతో ఆ పేరొచ్చింది. తారలు బాగా ఆదరిస్తున్న ఈ సీజనల్‌ ఫ్యాషన్‌ని అబ్బాయిలు, అమ్మాయిలు సైతం అప్పుడే అందిపుచ్చుకుంటున్నారు. జీన్స్‌, ట్రౌజర్‌, ఫార్మల్‌ ప్యాంట్‌.. జతగా ఏది వేసినా అందంగా కనిపించడం ఈ టర్టిల్‌ నెక్‌ ఫ్యాషన్‌ ప్రత్యేకత. ఇందులో హాఫ్‌ జిప్పర్‌, ఫుల్‌ స్లీవ్‌, టీ షర్ట్‌, స్లిమ్‌ ఫిట్‌ అంటూ రకరకాలున్నాయి.

* టర్టిల్‌ నెక్‌ చొక్కాలు, స్వెటర్లను డెనిమ్‌ ప్యాంట్‌తో కలిపి వేసుకుంటే బాగుంటుంది. ప్యాంట్‌కి బెల్ట్‌, మెడలో మఫ్లర్‌ లేదా స్టోల్‌ వేసుకుంటే మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు.

* భారీకాయులు, పొడుగ్గా ఉన్నవారు ఈ స్వెటర్‌, చొక్కాలపై లెదర్‌ జాకెట్‌ వేసుకుంటే సాలిడ్‌గా, హుందాగా కనిపిస్తారు.

* ఫార్మల్‌గా కనిపించాలనుకుంటే టర్టిల్‌ నెక్‌కి జోడీగా ట్రౌజర్‌, ఫార్మల్‌ జాకెట్‌ వేసుకోవాలి.

* పాతికేళ్లలోపు కుర్రాళ్లు ఆధునికంగా, క్యాజువల్‌గా ఉండాలంటే చినోస్‌ ప్యాంటు, డెనిమ్‌ జాకెట్‌ ధరించాల్సిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని