చెమటతో సువాసన

ఎండాకాలం... ఉక్కపోత.... చెమట.. నిపుణులేమో తెల్లని దుస్తులు ధరించమని సూచిస్తుంటారు. తెల్లని డ్రెస్‌ వేసుకుంటే వెంటనే మరకలు.. పైగా చెమట వాసన..

Updated : 18 May 2019 05:47 IST

ఎండాకాలం... ఉక్కపోత.... చెమట.. నిపుణులేమో తెల్లని దుస్తులు ధరించమని సూచిస్తుంటారు. తెల్లని డ్రెస్‌ వేసుకుంటే వెంటనే మరకలు.. పైగా చెమట వాసన.. ఎలా మరి?

ఈ సమస్యలకు పరిష్కారంగా మరకలు పడని, చెమట వాసనని దూరం చేసే టీషర్ట్‌లను తయారుచేశారు ఫ్యాషన్‌ డిజైనర్లు. ఈ క్లాత్‌తో తయారు చేసిన తెల్లని దుస్తులు వేసుకున్నా మరకలు అంటవు. పైగా ఎంత చెమట పట్టినా... ఎటువంటి దుర్వాసన రాకుండా సువాసనలు వెదజల్లే టీషర్ట్స్‌ రూపొందించారు. రూ.700 నుంచి రూ.1000 లోపు ధరలోనే అందుబాటులో ఉంచారు. స్లిమ్‌ఫిట్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ షర్ట్స్‌కు యువత నుంచి మంచి స్పందన వస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని