ఎరుపంటే ఇష్టం
మనసు దోచిన ప్రియుడ్ని మొదటిసారి కలుసుకోబోయే ప్రియురాలికి, నచ్చిన చెలికాడిని చూడాలని...
ఎరుపంటే ఇష్టం
మనసు దోచిన ప్రియుడ్ని మొదటిసారి కలుసుకోబోయే ప్రియురాలికి, నచ్చిన చెలికాడిని చూడాలని తహతహలాడుతున్న చిన్నదానికి మొదటి కలయిక ఎప్పుడూ మధురజ్ఞాపకమే. అసలింతకు తొలిసారి కలవబోతున్న ప్రేమికులు ఏం కోరుకుంటారు? ఇదే విషయాలపై ప్రముఖ డేటింగ్ యాప్ దేశవ్యాప్తంగా ఓ సర్వే చేసింది. ఆ అధ్యయనం ప్రకారం అత్యధికశాతం కుర్రాళ్లు తమ ప్రియురాలు పెదాలకు ఎరుపురంగు లిప్‌స్టిక్ అద్దుకొని రావాలని కోరుకుంటున్నారట. అమ్మాయిల విషయానికొస్తే అబ్బాయిలు తెలుపు రంగు టీషర్టులో తమ చెంత చేరాలని కలలు కంటున్నారట. సూటిగా, సుత్తిలేకుండా మాట్లాడే ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిలనూ వారు బాగా ఇష్టపడతారట. ఇంకాస్త ముందుకెళ్తే తొంభైమంది మగానుభావులు తొలి కలయికలోనే అమ్మాయిలతో ముద్దులాటకు దిగాలని కోరుకుంటున్నారట. అరవై శాతం అతివలకైతే కుర్రాళ్ల జుత్తులతో ఆడుకోవడం అంటే సరదానట. ఈ అధ్యయనం కోసం 18 నుంచి 30 ఏళ్ల వయసున్న ఆరువేల ఐదువందల యువతీయువకుల్ని సర్వే చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్‌లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్‌తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్‌ను ఎలా వాడాలి?