AP Cabinet: విశాఖ అభివృద్ధికి కీలక అడుగులు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 25 Jul 2025 06:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పలు సంస్థలకు భూముల కేటాయింపులు
పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల ఉపసంహరణకు అదానీ గ్రీన్‌ ఎనర్జీకి అనుమతి 
మంత్రిమండలి నిర్ణయాలు

క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పార్థసారథి

ఈనాడు, అమరావతి: విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలను తీసుకుంది. పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా భూములను కేటాయించింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం మేరకు ఈ నిర్ణయాలు తీసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 

  • మధురవాడ, రుషికొండ ఐటీ పార్కులలో ఫీనమ్‌ పీపుల్‌ సంస్థకు 4.45 ఎకరాల కేటాయింపు. ఎకరానికి రూ.4.05 కోట్ల చొప్పున వసూలు. రూ.207.50 కోట్ల విలువైన పెట్టుబడులు, 2,500 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఆమోదం. 12 నెలల్లో ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలి. తొలి ఏడాది 1,250, తర్వాత రెండేళ్లలో 1,250 ఉద్యోగాలు ఇవ్వాలి. 
  • మధురవాడ ఐటీ హిల్‌ 3పై 3.6 ఎకరాలు ఎకరం రూ.కోటి చొప్పున, పరదేశిపాలెంలో ఎకరం రూ.50 లక్షల చొప్పున 50 ఎకరాలు సిఫీ ఇన్ఫినిట్‌ స్పేసెస్‌ లిమిటెడ్‌కు కేటాయింపు. వారి రూ.16,466 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన, 600 ఉద్యోగాల కల్పనకు ఆమోదం. 
  • మధురవాడ ఐటీ హిల్‌పై 30 ఎకరాల భూమి సత్య డెవలపర్స్‌కు ఎకరం రూ.1.50 కోట్ల ధరకు అప్పగించేందుకు ఆమోదం. రూ.1,500 కోట్ల పెట్టుబడులతో 25 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యం. 
  • మధురవాడ ఐటీ హిల్‌ నంబరు 3పై 2.5 ఎకరాలు, హిల్‌ నంబరు 4పై 7.79 ఎకరాలు ఏఎన్‌ఎస్‌ఆర్‌ గ్లోబల్‌ కార్పొరేషన్‌కు కేటాయింపులు. రూ.1,000 కోట్ల పెట్టుబడులు, 10,000 ఉద్యోగాల కల్పన ప్రాజెక్టు ప్రతిపాదనకు ఆమోదం. ప్రోత్సాహకాల అందజేతకు నిర్ణయం. 
  • ఎండాడలో 30 ఎకరాల భూమి ఎకరం 1.5 కోట్ల చొప్పున బీవీఎం ఎనర్జీ అండ్‌ రెసిడెన్సీ సంస్థకు కేటాయింపు. రూ.1,250 కోట్ల పెట్టుబడులు, 15 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యం. 
  • ఆంధ్రప్రదేశ్‌ అధీకృత లే అవుట్లు, ప్లాట్ల నియంత్రణ చట్టం 2020 సవరణలకు ఆమోదం. 
  • అనకాపల్లి జిల్లా చెర్లోపల్లికందం గ్రామంలో 2007లో ప్రారంభించిన 58.18 ఎకరాల భూ సమీకరణ కొనసాగించేందుకు విశాఖ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌కు అనుమతి. 
  • ఖనిజాభివృద్ధి సంస్థ రూ.5,526.18 కోట్ల సబ్‌స్క్రిప్షన్‌ స్వీకరించడానికి 9.3% కూపన్‌ ధరతో బిడ్‌ చేయడం తదితర కార్యకలాపాలకు ఆమోదం. 
  • అంతర రాష్ట్ర సరిహద్దు వివాదాలతో ప్రభావితమైన కురుకుట్టి పీఎస్‌పి (1200 మెగావాట్లు), కర్రివలస పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు (1,000 మెగావాట్లు) కేటాయింపుల రద్దుకు ఆమోదం. అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ వాటిని ఉపసంహరించుకునేందుకు ప్రతిపాదించింది.
  • ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీ తీర్మాన ప్రతిపాదనలకు ఆమోదం. 
  • నీటి పన్ను బకాయిలపై రూ.85.81 కోట్ల అసాధారణ వడ్డీ మొత్తాన్ని రైతుల నుంచి బకాయిలు వసూలు చేసేటప్పుడు మాఫీ చేసే ప్రతిపాదనకు ఆమోదం.
Tags :
Published : 25 Jul 2025 05:12 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు