అందుకే నా చర్మంతో సీఎంకు చెప్పులు కుట్టిస్తా అన్నాను: నారాయణస్వామి

‘వాళ్లమటుకు వాళ్లే చనిపోయారు. అయినా తెదేపా 10 రోజులుగా కల్తీ సారా మరణాలు అంటూ హడావుడి చేస్తోంది. తెదేపా హయాంలోనే ఊరూరా సారా ప్రవాహం ఉంది’ అని ఉప ముఖ్యమంత్రి (అబ్కారీ) నారాయణస్వామి పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టి మాట్లాడారు. ‘మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కొత్తగా ఒక్క డిస్టిలరీ, బెవరేజ్‌కు అనుమతి

Updated : 22 Mar 2022 07:43 IST

 కల్తీ సారాపై తెదేపా హడావుడి చేస్తోంది

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వెల్లడి

ఈనాడు, అమరావతి: ‘వాళ్లమటుకు వాళ్లే చనిపోయారు. అయినా తెదేపా 10 రోజులుగా కల్తీ సారా మరణాలు అంటూ హడావుడి చేస్తోంది. తెదేపా హయాంలోనే ఊరూరా సారా ప్రవాహం ఉంది’ అని ఉప ముఖ్యమంత్రి (అబ్కారీ) నారాయణస్వామి పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టి మాట్లాడారు. ‘మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కొత్తగా ఒక్క డిస్టిలరీ, బెవరేజ్‌కు అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలోని డిస్టిలరీల్లో 4 తెదేపా నేతలైన ఆదికేశవులు నాయుడు, ఎస్‌పీవై రెడ్డి, అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు వియ్యంకుడివి కావా? ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్‌ రిజర్వు బ్రాండ్లు, బూమ్‌ బీరు, హైఓల్టేజ్‌, బ్రిటీష్‌ అంపైర్‌ బీర్లు, రాయల్‌ ప్యాలెస్‌ వంటి బ్రాండ్లకు గత ప్రభుత్వంలోనే అనుమతిచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక 43వేల బెల్ట్‌షాపులు, మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 4,300 పర్మిట్‌ రూమ్‌లను తొలగించాం’ అని వివరించారు. ‘నాకు ఉప ముఖ్యమంత్రి పదవి రావడమే ఆశ్చర్యం. అందుకే నా చర్మంతో సీఎంకు చెప్పులు కుట్టిస్తానని గతంలో చెప్పా’ అని తెలిపారు. ప్రెసిడెంట్‌ మెడల్‌ బ్రాండ్‌పై ఉపముఖ్యమంత్రి వివరిస్తున్నప్పుడు.. అదేమిటని స్పీకర్‌ అడిగారు. అదొక బ్రాండ్‌ అని, మీకు తెలిసే ఉంటుందని అనుకున్నట్లు నారాయణస్వామి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని