Amalapuram: బందోబస్తుతో వెళ్లి ఓటేసిన కుటుంబం.. అమలాపురంలో ఆలస్యంగా వెలుగులోకి..

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఓ కుటుంబం పోలీసు, రెవెన్యూ అధికారుల బందోబస్తు నడుమ ఈ నెల 13న ఓటు హక్కు వినియోగించుకుంది.

Updated : 26 May 2024 08:12 IST

ఈనాడు, రాజమహేంద్రవరం: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఓ కుటుంబం పోలీసు, రెవెన్యూ అధికారుల బందోబస్తు నడుమ ఈ నెల 13న ఓటు హక్కు వినియోగించుకుంది. ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఓ కుటుంబానికి స్థానికులతో రహదారి వివాదం ఉంది. ఆ మార్గంలో రాకపోకలకు తమను అనుమతించరని, ఓటేసే అవకాశం కోల్పోతామని ఆ కుటుంబసభ్యులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. అక్కడి నుంచి ఆ వివరాలు కలెక్టరేట్‌కు చేరాయి. విషయం ఎన్నికల పరిశీలకుడి దృష్టికి వెళ్లింది. పోలింగ్‌ రోజున ఓ కానిస్టేబుల్, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో ఆ దంపతులు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి భద్రపరిచినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని