Vijayawada: స్కూల్‌ వాట్సప్‌ గ్రూప్‌ చూడట్లేదని టీచర్‌ సస్పెన్షన్‌

విజయవాడలోని మొగల్రాజపురం బీఎస్‌ఆర్‌కే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.రమేష్‌.. స్కూల్‌వాట్సప్‌ గ్రూప్‌లోని మెసేజ్‌లు చూడడం లేదని ఆయనను సస్పెండ్‌ చేయడం వివాదాస్పదంగా మారింది.

Updated : 26 May 2024 08:54 IST

మండిపడ్డ ఉపాధ్యాయ సంఘాలు

ఎన్టీఆర్‌ జిల్లా విద్యాశాఖ కార్యాలయ సహాయ సంచాలకులు జి.రాజేశ్వరికి వినతిపత్రం అందజేస్తున్న యూటీఎఫ్‌ నేతలు

ఈనాడు డిజిటల్, అమరావతి: విజయవాడలోని మొగల్రాజపురం బీఎస్‌ఆర్‌కే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.రమేష్‌.. స్కూల్‌వాట్సప్‌ గ్రూప్‌లోని మెసేజ్‌లు చూడడం లేదని ఆయనను సస్పెండ్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే సస్పెన్షన్‌ను రద్దు చేయాలంటూ.. జిల్లా విద్యాశాఖ అధికారులకు యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు. తనకు కంటి సంబంధిత సమస్య ఉండడంతో స్మార్ట్‌ఫోన్‌ వాడొద్దని వైద్యులు సూచించారని రమేష్‌ వివరణ ఇచ్చినా.. వ్యక్తిగత విషయాన్ని సాకుగా చూపిస్తూ సస్పెండ్‌ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు మాట్లాడుతూ.. వాట్సప్‌ గ్రూపు నుంచి రమేష్‌ అకస్మాత్తుగా వెళ్లిపోవడం, విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడం, కంటి సమస్య ఉన్నట్లు వైద్యులు సూచించిన ధ్రువీకరణపత్రాలు సమర్పించాలని కోరినా స్పందించకపోవడం వల్లే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని