TDP: హిందూపురంలో అన్న క్యాంటీన్‌ పునఃప్రారంభం

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం శాసనసభ్యుడిగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ సోమవారం తన జన్మదిన వేడుకలను తెదేపా నేతలు, కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకొన్నారు.

Updated : 11 Jun 2024 08:38 IST

తన జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్‌ను పునఃప్రారంభించి భోజనం వడ్డిస్తున్న బాలకృష్ణ  

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం శాసనసభ్యుడిగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ సోమవారం తన జన్మదిన వేడుకలను తెదేపా నేతలు, కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. స్వగృహంలో కేక్‌ కోసి తన అభిమాని అయిన నాలుగేళ్ల అనిత్‌కుమార్‌కు తినిపించారు. అనంతరం ఎన్టీఆర్‌ ఆరోగ్య రథం, అన్న క్యాంటీన్‌ను పునఃప్రారంభించి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ముందుకు వెళ్తామని, హిందూపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని