Fish: చేప కిలో రూ.10 నుంచి రూ.25

వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులు ఆక్వా రైతుల పాలిట శాపంగా మారాయి. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా విభిన్న వాతావరణం కొనసాగుతోంది. దీంతో ఆక్వా చెరువుల్లో ప్రాణవాయువు సమస్య ఉత్పన్నమై చేపలు, రొయ్యలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.

Published : 27 May 2024 04:13 IST

వాతావరణ మార్పులతో కళ్లు తేలేసిన చేప!

ఆకివీడు హోల్‌సేల్‌ మార్కెట్‌ వద్ద కొనుగోలుదారుల రద్దీ

ఆకివీడు, న్యూస్‌టుడే: వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులు ఆక్వా రైతుల పాలిట శాపంగా మారాయి. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా విభిన్న వాతావరణం కొనసాగుతోంది. దీంతో ఆక్వా చెరువుల్లో ప్రాణవాయువు సమస్య ఉత్పన్నమై చేపలు, రొయ్యలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలో, కొల్లేరు తీర ప్రాంత చెరువుల్లో అధిక శాతం చేపలు కళ్లు తేలేయడంతో రైతులు అప్పటికప్పుడు పట్టుబడులు చేయాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి ఆకివీడులో హోల్‌సేల్‌ మార్కెట్‌కు సుమారు 150 పైగా లారీలు, వ్యాన్లలో చేపలను రైతులు తీసుకొచ్చారు. సాధారణంగా ఈ మార్కెట్‌కు నిత్యం 35 నుంచి 40 టన్నుల చేపలు వస్తాయి. ఆదివారం 200 టన్నుల సరకు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా సరకు రావడంతో కిలో రూ.100 పలికే చేప ధర భారీగా పడిపోయింది. సైజును బట్టి కిలో రూ.10 నుంచి రూ.25కు వ్యాపారులు కొన్నారు. రొయ్యలు కూడా 6 టన్నుల వరకు రావడంతో ధర కిలో రూ.180 నుంచి రూ.100-120కి పడిపోయింది. ఉమ్మడి జిల్లా పరిధిలో భీమవరం, ఏలూరు మార్కెట్లకు కూడా వందల టన్నుల చేపలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని