Chandra babu: నా కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు.. భద్రతాధికారులకు చంద్రబాబు ఆదేశం

భద్రతా కారణాల పేరుతో బారికేడ్ల ఏర్పాటు, పరదాలు కట్టడం, దుకాణాల బంద్, రోడ్ల మూసివేత వంటి పోకడలకు ఇకనుంచి స్వస్తి పలకాలని తెదేపా అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Updated : 07 Jun 2024 07:13 IST

బారికేడ్లు, పరదాలు, దుకాణాలు  మూత.. పోకడలకు స్వస్తి చెప్పాలని సూచన

ఈనాడు డిజిటల్, అమరావతి: భద్రతా కారణాల పేరుతో బారికేడ్ల ఏర్పాటు, పరదాలు కట్టడం, దుకాణాల బంద్, రోడ్ల మూసివేత వంటి పోకడలకు ఇకనుంచి స్వస్తి పలకాలని తెదేపా అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భద్రత పేరుతో ప్రజలను వేధించవద్దని స్పష్టం చేశారు. ఎన్డీయే సమావేశం కోసం గురువారం రాత్రి దిల్లీ బయల్దేరిన ఆయన...వాహనశ్రేణి వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ను ఎక్కువ సేపు నిలపొద్దని తన ముఖ్యభద్రతాధికారికి సూచించారు. తక్షణం ఈ ఆదేశాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. దీంతో చంద్రబాబు బయల్దేరే ముందే విజయవాడ సీపీ, గుంటూరు ఎస్పీలకు చంద్రబాబు భద్రతా సిబ్బంది సమాచారం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని