ప్రస్తుత అధ్యక్షుడి పేరుపై జూడో నిర్వహణకు అనుమతివ్వండి

కర్నూలులో ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు నిర్వహించనున్న సౌత్‌ జోన్‌ రెండో ఖేలో ఇండియా ఉమెన్స్‌ లీగ్‌ జూడో టోర్నమెంట్‌ నిర్వహణ అనుమతిని తాత్కాలిక (యాక్టింగ్‌) అధ్యక్షులు జి.సుబ్బారావు ఉన్న ఏపీ జూడో అసోసియేషన్‌ పేరుపై ఇవ్వాలని భారత జూడో సమాఖ్యను హైకోర్టు ఆదేశించింది.

Published : 26 Jan 2023 05:00 IST

భారత జూడో సమాఖ్యకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: కర్నూలులో ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు నిర్వహించనున్న సౌత్‌ జోన్‌ రెండో ఖేలో ఇండియా ఉమెన్స్‌ లీగ్‌ జూడో టోర్నమెంట్‌ నిర్వహణ అనుమతిని తాత్కాలిక (యాక్టింగ్‌) అధ్యక్షులు జి.సుబ్బారావు ఉన్న ఏపీ జూడో అసోసియేషన్‌ పేరుపై ఇవ్వాలని భారత జూడో సమాఖ్యను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌.మానవేంద్రనాథ్‌రాయ్‌ ఈనెల 24న ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కర్నూలులో నిర్వహించనున్న జూడో టోర్నమెంట్‌ నిర్వహణను (అలాంట్‌మెంట్‌) ఏపీ జూడో అసోసియేషన్‌ పూర్వ అధ్యక్షులు కిశోర్‌రెడ్డి పేరుపై భారత జూడో సమాఖ్య అనుమతి ఇచ్చిందని పేర్కొంటూ ఏపీ జూడో అసోసియేషన్‌ కార్యదర్శి పవన్‌ సందీప్‌ హైకోర్టును ఆశ్రయించారు. కిశోర్‌రెడ్డి రాజీనామా సమర్పించారని, ప్రస్తుతం అధ్యక్షుడిగా జి.సుబ్బారావు వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన ఆధ్వర్యంలోని ఏజీ జూడో అసోసియేషన్‌కు నిర్వహణను కేటాయించేలా ఆదేశించాలని కోరారు. ఆ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని