Andhra News: రహదారి లేక 5 కి.మీ. నడిచిన నిండు గర్భిణి

విమానం ఎక్కి నింగిలోకి.. రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి మానవులు వెళుతున్నా.. చాలాచోట్ల గిరిజనులు పట్టణాల్లోకి రావడానికి ఇంకా రహదార్లు నిర్మాణం కాకపోవడం గమనార్హం.

Updated : 29 Jun 2023 13:23 IST

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: విమానం ఎక్కి నింగిలోకి.. రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి మానవులు వెళుతున్నా.. చాలాచోట్ల గిరిజనులు పట్టణాల్లోకి రావడానికి ఇంకా రహదార్లు నిర్మాణం కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అంబులెన్సు రావడానికి రోడ్డు లేక నిండు గర్భిణి అయిదు కి.మీ. దూరం నడిచిన ఘటన  అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ చీపురుగొంది గ్రామానికి చెందిన కొరా కావ్య గర్భిణి. బుధవారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో గ్రామం నుంచి కిముడుపల్లి పంచాయతీ కేంద్రం వరకు కుటుంబసభ్యులు కాలినడకన తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్సులో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్డు సదుపాయం లేక గిరిజనులకు అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు తప్పడం లేదు. సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేక లుక్సరిపుట్లు గ్రామానికి చెందిన ముగ్గురు గర్భిణులు, మరొకరు గతంలో మృత్యువాత పడ్డారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని