శ్రీచైతన్య అధినేత బి.ఎస్‌.రావు కన్నుమూత

శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత...బి.ఎస్‌.రావుగా ప్రఖ్యాతులైన డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు (75) ఇకలేరు. గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు.

Updated : 14 Jul 2023 06:36 IST

ఇంట్లో తీవ్ర అస్వస్థత
ఆసుపత్రికి తరలించేలోపు మృతి
రేపు విజయవాడలో అంత్యక్రియలు

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత...బి.ఎస్‌.రావుగా ప్రఖ్యాతులైన డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు (75) ఇకలేరు. గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. అప్పటినుంచి జూబ్లీహిల్స్‌లోని తమ నివాసంలో ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. అనంతరం పార్థివదేహాన్ని విజయవాడ శివారులోని తాడిగడపకు తరలించారు. అక్కడి సరస్వతీ సౌధం వద్ద ఉన్న సొంతింటి వద్ద శుక్రవారం ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. బి.ఎస్‌.రావు చిన్న కుమార్తె సీమ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆమె వచ్చాక.. శనివారం అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని