RK Selvamani: రోజా భర్త సెల్వమణిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

పరువునష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో డైరెక్టర్‌ ఆర్‌.కె.సెల్వమణిపై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ అయింది.

Updated : 29 Aug 2023 08:59 IST

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే: పరువునష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో డైరెక్టర్‌ ఆర్‌.కె.సెల్వమణిపై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ అయింది. చెన్నై జార్జ్‌టౌన్‌ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ మంత్రి, నటి రోజా భర్త సెల్వమణి పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఓ కేసులో ముకుంద్‌చంద్‌ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్‌ 2016లో అరెస్టయ్యారు. ముకుంద్‌ కారణంగా తాను ఇబ్బందులకు గురయ్యానంటూ సెల్వమణి ఓ ఛానల్‌ ముఖాముఖిలో చెప్పారనేది ఆరోపణ. ఈ వ్యాఖ్యలతో తన పరువుకు నష్టం వాటిల్లిందని ముకుంద్‌ కేసు దాఖలు చేశారు. అనంతరం ఆయన మృతి చెందగా వారి కుమారుడు గగన్‌బోత్రా కేసును కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణ సోమవారం జరిగినప్పటికీ సెల్వమణి హాజరుకాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు