AP CID: చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోం

మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలతో తెదేపా అధినేత చంద్రబాబుపై నమోదుచేసిన కేసులో నవంబరు 28 వరకూ ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని, అరెస్టు చేయబోమని రాష్ట్రప్రభుత్వం, సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌ హైకోర్టుకు హామీ ఇచ్చారు.

Updated : 01 Nov 2023 07:43 IST

‘మద్యం కంపెనీలకు అనుమతుల’ కేసులో హైకోర్టుకు ఏజీ హామీ

ఈనాడు, అమరావతి: మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలతో తెదేపా అధినేత చంద్రబాబుపై నమోదుచేసిన కేసులో నవంబరు 28 వరకూ ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని, అరెస్టు చేయబోమని రాష్ట్రప్రభుత్వం, సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌ హైకోర్టుకు హామీ ఇచ్చారు. చికిత్స నిమిత్తం చంద్రబాబుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిలు మంజూరు చేసిన నేపథ్యంలో ఆ ఉత్తర్వుల ఉద్దేశం నెరవేరేవరకూ సీఐడీ ఎలాంటి చర్యలు తీసుకోబోదని స్పష్టంచేశారు. ఏజీ హామీని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు నమోదు చేశారు. ఇరువైపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణను నవంబరు 21కి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని