సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన చంద్రబాబు దంపతులు

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దంపతులు దిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థలూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Updated : 28 Nov 2023 08:44 IST

ఈనాడు, దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) దంపతులు దిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థలూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సోమవారం సాయంత్రం సతీమణి భువనేశ్వరితో కలిసి దిల్లీకి వచ్చిన చంద్రబాబుకి పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ దంపతులు, ఎంపీలు కేశినేనినాని, రామ్మోహన్‌నాయుడు, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. రాత్రి ఇక్కడి హయాత్‌హోటల్‌లో జరిగిన రిసెప్షన్‌కు చంద్రబాబు దంపతులతోపాటు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన తర్వాత కంటి శస్త్రచికిత్స చేయించుకున్న చంద్రబాబు కొంతకాలంగా హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పటివరకూ ఎక్కడికీ వెళ్లలేదు. తొలిసారి దిల్లీకొచ్చారు. ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు