తితిదేకు రూ.5 కోట్ల విద్యుత్‌ గాలిమర విరాళం

ముంబయికి చెందిన విష్‌ విండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ తితిదేకు రూ.5 కోట్ల విలువైన గాలిమరను విరాళంగా అందించింది. తిరుమల జీఎన్‌సీ ప్రాంతంలో ఈ గాలిమర ఏర్పాట్లను శుక్రవారం ఉదయం తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు.

Published : 02 Dec 2023 05:07 IST

తిరుమల, న్యూస్‌టుడే: ముంబయికి చెందిన విష్‌ విండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ తితిదేకు రూ.5 కోట్ల విలువైన గాలిమరను విరాళంగా అందించింది. తిరుమల జీఎన్‌సీ ప్రాంతంలో ఈ గాలిమర ఏర్పాట్లను శుక్రవారం ఉదయం తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ బోర్డు (ఏపీఎస్‌ఈబీ) నుంచి అనుమతులు వచ్చాక తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ విద్యుత్‌ గాలిమర ద్వారా సంవత్సరానికి 18 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, దీంతో ఏటా తితిదేకు రూ.కోటి ఆదా అవుతుందని చెప్పారు. తితిదే అవసరాలకు 15 ఏళ్ల క్రితమే ఈ కంపెనీ వారు 1.03 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే రెండు గాలిమరలు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీ వారే చూసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న గాలిమర నిర్వహణను కూడా వీరే చూడనున్నారని ఈవో తెలిపారు. కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని