కేజీబీవీ కార్యదర్శికి జాతీయ అవార్డు

విద్యారంగంలో ఉత్తమ ఆవిష్కరణలు, అభ్యసన విధానం అమలుకు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) కార్యదర్శి మధుసూదనరావుకు జాతీయ అవార్డు లభించింది.

Published : 08 Dec 2023 03:24 IST

ఈనాడు, అమరావతి: విద్యారంగంలో ఉత్తమ ఆవిష్కరణలు, అభ్యసన విధానం అమలుకు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) కార్యదర్శి మధుసూదనరావుకు జాతీయ అవార్డు లభించింది. ఆయన 2017-18లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీఈఓగా పని చేశారు. ఆ సమయంలో గణితం, ఆంగ్లం, తెలుగు సబ్జెక్టుల్లో ప్రాథమిక సామర్థ్యాలపై ప్రత్యేక కార్యక్రమం అమలు చేశారు. చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలను విద్యార్థులకు నేర్పించారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు గ్రేడ్లు ఇచ్చారు. రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలపై జాతీయ విద్యా ప్రణాళిక, నిర్వహణ సంస్థ(ఎన్‌ఐఈపీఏ) దరఖాస్తులను ఆహ్వానించగా ఏపీ నుంచి ఉత్తమ విధానంగా ఈ విధానం ఎంపికైంది. 2020లో ఈ అవార్డు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇటీవల దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నుంచి మధుసూదన్‌ అవార్డు అందుకోగా... సమగ్రశిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు గురువారం ఆయనను అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని