Anantapuram: మహిళాశక్తి.. బైబిల్‌ భక్తి!

కలెక్టరేట్‌లోని వేదికను ఓ మహిళా అధికారి క్రైస్తవ మత ప్రచారానికి వాడుకోవడం వివాదాస్పదమైంది.

Published : 08 Dec 2023 07:44 IST

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లోని వేదికను ఓ మహిళా అధికారి క్రైస్తవ మత ప్రచారానికి వాడుకోవడం వివాదాస్పదమైంది. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ‘ఉన్నతి-మహిళా శక్తి’ పథకాన్ని జాయింట్‌ కలెక్టరు కేతన్‌గార్గ్‌, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి ప్రారంభించారు. జిల్లాకు మంజూరైన 13 ఆటోలను మహిళలకు పంపిణీ చేశారు. ముఖ్య అధికారులు వెళ్లిపోయాక మంజుల అనే డీఆర్‌డీఏ అధికారి వేదిక మీద లబ్ధిదారులకు బైబిల్‌ పుస్తకాలు పంచారు. కొందరు వాటిని తీసుకోగా.. వారితో కలిసి ఆమె ఫొటోలు తీయించుకున్నారు. దీనిపై పీడీ నరసింహారెడ్డిని వివరణ కోరగా.. తాము ఏ మత ప్రచార కార్యక్రమాలూ చేపట్టలేదని, సమావేశం అనంతరం ఎవరైనా ఆ వేదికను వాడుకొని ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత గ్రంథాన్ని పంచిన అధికారి మంజులను వివరణ అడగ్గా.. ఎవరో చర్చికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఇచ్చారని, తనకు సంబంధం లేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని