వరద మింగిన రైతు కష్టం

మిగ్‌జాం తుపాను అన్నదాతను నిలువునా ముంచేసింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరుకు చెందిన కౌలు రైతు పల్నాటి అర్జునరావు 46 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపానుకు ముందు 23 ఎకరాల్లో  పంట కోశారు.

Published : 09 Dec 2023 05:03 IST

ఈనాడు, ఏలూరు: మిగ్‌జాం తుపాను అన్నదాతను నిలువునా ముంచేసింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరుకు చెందిన కౌలు రైతు పల్నాటి అర్జునరావు 46 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపానుకు ముందు 23 ఎకరాల్లో  పంట కోశారు. వర్షాలకు పనలు తడిసిపోయాయి. శుక్రవారం కూలీలతో పనలను తిరగవేయించి చూస్తే కంకుల నిండా మొలకలొచ్చాయి. పెట్టుబడి, కౌలు కలిపి ఎకరాకు రూ.60 వేల చొప్పున ఖర్చయిందని రైతు తెలిపారు. నేలపాలైన పంటను ఒడ్డుకు చేర్చడానికి రెట్టింపు ఖర్చవుతోందని తెలిపారు. కోతకు ముందు ఎకరాకు 15 కిలోల పెసలు చల్లామని, అవన్నీ కొట్టుకుపోవడం, కుళ్లిపోవడంతో రెండోసారీ వేశామని అన్నారు. అధికారులు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.        

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని